ETV Bharat / bharat

వరదల్లో కొట్టుకుపోయిన వ్యక్తి.. 14 రోజుల తర్వాత మళ్లీ.. - కర్ణాటక చిక్కమంగళూరు

ఓ వ్యక్తి వరదల్లో కొట్టుకుపోయాడు. అధికారులు ఎంత గాలించినా ఆచూకీ దొరకలేదు. రోజులు గడిచినా ఎలాంటి సమాచారం లేకపోవడం వల్ల కుటుంబసభ్యులు కూడా అతను మరణించి ఉంటాడని భావించారు. కానీ ఉన్నట్లుండి మంగళవారం ప్రత్యక్షమయ్యాడు. చనిపోయాడు అనుకున్న వ్యక్తి కనిపించేసరికి కుటుంబసభ్యులు, అధికారులు షాక్​ అయ్యారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..

suresh
సురేశ్
author img

By

Published : Jul 27, 2022, 12:05 PM IST

వరదల్లో కొట్టుకుపోయి మరణించాడనుకున్న ఓ వ్యక్తి ప్రాణాలతో తిరిగివచ్చాడు. ఈనెల 12న వరదల్లో కొట్టుకుపోయిన సురేశ్​.. 14 రోజుల తర్వాత మళ్లీ మంగళవారం ఆ పట్టణ వీధుల్లో తిరుగుతూ కనిపించాడు. ఈ ఘటన కర్ణాటకలోని చిక్కమంగళూరులో జరిగింది. భారీ వర్షాలకు స్థానికంగా ఉండే ఓ కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో అతను కాలువ దాటేందుకు ప్రయత్నించగా వరదలో కొట్టుకుపోయాడు.

suresh
సురేశ్​.. చనిపోయాడనుకుని అధికారులు, కుటుంబీకులు భావించిన వ్యక్తి

అధికారులు ఎంత గాలించినా ఫలితం లేకపోయింది. కుటుంబసభ్యులు కూడా సురేశ్​ మృతిచెందాడని అనుకున్నారు. కానీ 14 రోజుల తర్వాత మళ్లీ మంగళవారం పట్టణ వీధుల్లో తిరుగుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న అధికారులు అతడిని కుటుంబసభ్యులకు అప్పగించారు. తమకు సమాచారం ఇవ్వకుండా రోడ్లపై తిరుగుతున్నందుకు సురేశ్​ను మందలించారు అధికారులు. మరోవైపు చనిపోయాడని అనుకున్న వ్యక్తి కనిపించేసరికి కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి : గొడుగులు వేసుకొని రైలు ప్రయాణం.. ఎక్కడ? ఎందుకో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.