ETV Bharat / bharat

'పిచ్చోడి చేతిలో రాయిలా దేశద్రోహ చట్టం!' - దేశద్రోహ చట్టం

Supreme Court
సుప్రీం కోర్టు
author img

By

Published : Jul 15, 2021, 11:58 AM IST

Updated : Jul 15, 2021, 9:08 PM IST

11:57 July 15

దేశద్రోహ చట్టంపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

దేశద్రోహం చట్టం(ఐపీసీ సెక్షన్‌ 124ఏ)పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లవుతున్నప్పటికీ రాజద్రోహం కేసుల నమోదుకు వీలు కల్పిస్తున్న 124ఏ సెక్షన్​ను అమలు చేయడం వెనక ఆంతర్యం ఏమిటని కేంద్రాన్ని ప్రశ్నించింది.

సెక్షన్ 124ఏ చట్టబద్ధత భావ ప్రకటన స్వేచ్ఛను ఉల్లంఘిస్తోందంటూ విశ్రాంత సైన్యాధికారి మేజర్‌ జనరల్‌ ఎన్‌.జి.వోంబట్కెరే దాఖలు చేసిన పిటిషన్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. 'ప్రస్తుతం రాజద్రోహం కింద పెడుతున్న కేసులెన్ని? నిలబడుతున్న కేసులెన్ని?' అని కేంద్రాన్ని ప్రశ్నించింది.

'దుర్వినియోగమే అధికం'

వలస పాలనలో స్వాతంత్ర్యోద్యమాన్ని అణచివేసేందుకు మహాత్మాగాంధీ, బాలగంగాధర్‌ తిలక్‌ వంటి మహనీయులపై... ఈ సెక్షన్‌ కింద కేసులు నమోదు చేశారని సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ గుర్తుచేశారు. అలాంటి చట్టం కింద ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పేకాట ఆడుతున్న వారిపై, గ్యాంబ్లింగ్‌ నిర్వహిస్తున్న వారిపై కేసులు పెడుతున్న పరిస్థితి నెలకొందన్నారు. ఈ చట్టం దుర్వినియోగమవుతున్న సందర్భాలే ఎక్కువని జస్టిస్‌ రమణ వ్యాఖ్యానించారు. 

"అధికారదాహంతో బెదిరింపులకు పాల్పడుతూ బెయిల్‌ రాకుండా కక్ష సాధింపు చర్యలకు ఈ సెక్షన్‌ను పావులా వాడుతున్నారు. రాజకీయ ప్రత్యర్థుల్ని అణిచివేయడానికి 124ఏ సెక్షన్‌ను దుర్వినియోగం చేస్తున్న ఉదంతాలున్నాయి. ఫ్యాక్షనిస్టులు స్థానిక యంత్రాంగంపై ఒత్తిడి తీసుకువచ్చి ప్రత్యర్థులపై రాజద్రోహం మోపేలా కూడా వ్యవహరిస్తున్న ఉదాహరణలు ఉన్నాయి.ఈ సెక్షన్ పిచ్చోడి చేతిలో రాయిలాగా మారింది. కొయ్యను మలిచేందుకు వడ్రంగి చేతికి రంపం ఇస్తే అడవిని నాశనం చేసినట్టుగానే ఈ చట్టం అమలవుతోంది. ఐటీ చట్టంలో రద్దు చేసిన 66ఏ సెక్షన్‌ దుర్వినియోగం ఎలా జరిగిందో... రద్దు చేసిన సెక్షన్‌ కింద వేల కేసులు ఎలా నమోదు చేశారో ప్రత్యక్షంగా చూశాం."

-జస్టిస్ ఎన్వీ రమణ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

రాజద్రోహం సెక్షన్‌ 124ఏ తొలగింపు విషయంలో సహకరించాలని బుధవారం అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ను కోరిన ధర్మాసనం.. ఏం చెబుతారని గురువారం ప్రశ్నించింది. ఇప్పటికే జస్టిస్‌ యూయూ లలిత్‌, జస్టిస్‌ చంద్రచూడ్‌ ధర్మాసనాల ముందు పలు పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని, వాటి విషయంలో కౌంటర్‌ దాఖలుకు సమయం తీసుకున్నట్లు అటార్నీ జనరల్‌ తెలిపారు. ఆ పిటిషన్లు,  ఈ పిటిషన్‌ను విడివిడిగా చూడాలా లేక ఒకేలా చూడాలా అని చెప్పేందుకు సమయం కావాలని కోరారు.

కేంద్రానికి నోటీసులు

124ఏ సెక్షన్‌ తొలగించేందుకు ఆలోచించాలని ధర్మాసనం ఈ సందర్భంగా కేంద్రానికి సూచించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చట్టం రాజ్యాంగ చెల్లుబాటును పరిశీలించనున్నట్లు స్పష్టం చేసింది. 124ఏ సెక్షన్ రద్దు చేయాలని ఎడిటర్ గిల్డ్ దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న అన్ని పిటిషన్లు కలిపి ఒకేసారి విచారణ జరపనున్నట్లు స్పష్టంచేసిన ధర్మాసనం... ఈ మేరకు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

Last Updated : Jul 15, 2021, 9:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.