ETV Bharat / bharat

'వినమ్రత నాన్న వద్ద నేర్చుకున్నా.. ఆమె విలువలు నేర్పింది.. వాళ్లే నా బలం' - జస్టిస్ చంద్రచూడ్ పర్సనల్ లేటెస్ట్ న్యూస్

సామాన్యుడి కోణంలో ఆలోచించి తీర్పు చెప్పే జడ్జిగా పేరొందారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్. వినంమ్రంగా ఎలా ఉండాలనే విషయాన్ని తండ్రి నుంచి నేర్చుకున్నానని చెబుతున్నారు. తన జీవితంలోని మరిన్ని విశేషాలను పంచుకున్నారు. అవేంటంటే..

DY CHANDRACHUD INTERESTING FACTS
సతీ సమేతంగా జస్టిస్ చంద్రచూడ్
author img

By

Published : Nov 20, 2022, 10:22 AM IST

ఆధునిక భావాలున్న, సామాన్యుడి కోణంలో తీర్పు చెప్పే జడ్జిగా పేరొందారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధనంజయ యశ్వంత్‌ చంద్రచూడ్‌. ఆయన తీర్పులే కాదు.. ప్రతిభా, వ్యక్తిత్వాలూ ఉన్నతమే!

ఐఏఎస్‌ అవ్వాలనుకుని!
చిన్నప్పట్నుంచీ న్యాయశాస్త్రంపైనే ఆసక్తి. కాలేజీకి వచ్చేసరికి అర్థశాస్త్రం నచ్చడంతో.. దిల్లీ స్టీఫెన్స్‌ కాలేజీ నుంచి అర్థశాస్త్రంలో డిగ్రీ చేశారు. యూనివర్సిటీ టాపర్‌. "స్టీఫెన్స్‌లో క్లాస్‌మేట్స్‌ సివిల్స్‌కు సిద్ధమవుతుండటంతో నేనూ అటు వెళ్లాలనుకున్నా. ఐఏఎస్‌గా గ్రామీణ ప్రాంతాల్లో సేవ చేయొచ్చనుకున్నా. అప్పుడప్పుడూ డీయూ 'క్యాంపస్‌ లా సెంటర్‌'లో క్లాసులు వినేవాణ్ని. అవి న్యాయశాస్త్రంపైన మళ్లీ ఆసక్తిని కలిగించాయి. 'లా' ద్వారా అర్థవంతమైన చర్చలూ, సామాజిక సమతూకం సాధ్యమని ఇటు వచ్చా" అంటూ కాలేజీ రోజుల్ని గుర్తుచేసుకుంటారు. 'క్యాంపస్‌ లా సెంటర్‌' నుంచే 1982లో ఎల్‌ఎల్‌బీ, హార్వర్డ్‌ లా స్కూల్‌ నుంచి ఎల్‌ఎల్‌ఎమ్‌, జ్యురిడికల్‌ సైన్సెస్‌లో పీహెచ్‌డీ చేశారు.

వాళ్లే స్ఫూర్తి
వినమ్రంగా ఉండటం నాన్న (వైవీ చంద్రచూడ్‌ సుప్రీంకోర్టు 16వ ప్రధాన న్యాయమూర్తి) నుంచి అలవర్చుకున్నానంటారు. 'హోదాకి గర్వం తోడైతే ఆలోచనలు పక్కదారి పడతాయి' అంటారు. భీమ్‌బాయి.. ముంబయిలో వీరింట్లో పనిమినిషి. 'ఆమె చదువుకోలేదు. కానీ చాలా కథలు చెప్పేది. ఆమె దగ్గరే విలువల గురించి తెలుసుకున్నా. తన ప్రభావం నామీద చాలా ఉంది. అమ్మ, నాన్న, భార్య, పిల్లలు, అక్క.. వీళ్లే నా బలం. యోగా టీచర్‌ అనంత్‌ లిమాయే.. నా ఆధ్యాత్మిక ప్రయాణానికి ప్రేరణ. హార్వర్డ్‌లో క్రిమినల్‌ లా పాఠాలు చెప్పిన లోతిక సర్కార్‌, లింగ వివక్షకు వ్యతిరేకంగా పనిచేసిన అమెరికా సుప్రీంకోర్టు జడ్జి రూత్‌ బ్యాడెర్‌ గిన్స్‌బర్గ్‌.. నాకు స్ఫూర్తి' అని చెబుతారు.

అలా గుర్తుండిపోవాలి
న్యాయవ్యవస్థకు మానవీయతను జోడించిన జడ్జిగా గుర్తుండిపోవాలన్నదే లక్ష్యమంటారు జస్టిస్ చంద్రచూడ్. 'రాజ్యాంగాన్ని అధ్యయనం చేసే నిరంతర విద్యార్థిగా, సాంకేతికతతో న్యాయవ్యవస్థను ఆధునికీకరించి కోర్టు సేవల్ని సులభతరం చేసిన అధికారిగా గుర్తుండిపోవాలనుకుంటున్నా' అని చెబుతారు. ఈ- కమిటీ ఛైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు తీర్పుల ప్రత్యక్ష ప్రసారం, కోర్టు ప్రొసీడింగ్స్‌ రికార్డింగ్‌.. లాంటి మార్పులు తెచ్చారు.

మహిళల కోణం
ఆధార్‌కు సంబంధించిన ఓ కేసు తీర్పులో గోప్యత ప్రాథమిక హక్కనీ, శబరిమలైలో మహిళలకు నిషేధం ప్రాథమిక హక్కులకు భంగమేననీ.. తీర్పు చెప్పారు. 'ఏ కేసూ చిన్నది కాదు.. అది ఒక్క వ్యక్తి భావప్రకటనకు సంబంధించినదైనా సరే. మహిళల కోణంలో ఎక్కువగా ఆలోచించడానికి- ఇంట్లో డిన్నర్‌ సమయంలో జరిగే చర్చలూ, బాంబే హైకోర్టులో మహిళా జడ్జి బెంచ్‌లో జూనియర్‌గా ఉండటం' లాంటివి కారణాలంటారు.

పుస్తకాలే ప్రపంచం
ఇంటర్‌ తర్వాత కామెర్ల కారణంగా కొన్నాళ్లు విశ్రాంతి తీసుకున్నప్పుడు పుస్తక పఠనం అలవాటు చేసుకున్నారు. ఆఫ్‌ హ్యూమన్‌ బాండేజ్‌, రేజర్స్‌ ఎడ్జ్‌, బియాండ్‌ ఏ బౌండరీ, ది స్ట్రేంజ్‌ ఆల్కెమీ ఆఫ్‌ లైఫ్‌ అండ్‌ లా.. చంద్రచూడ్‌కు నచ్చిన పుస్తకాలు. హిందీ రచయితలు మున్షీ ప్రేమ్‌చంద్‌, మహాదేవి వర్మ, రామ్‌ధారీ సింగ్‌ దినకర్‌, మరాఠా రచయిత పురుషోత్తం లక్ష్మణ్ దేశ్‌పాండేల ప్రభావమూ తనపై ఉంది. బాంబే హైకోర్టు 150 ఏళ్ల చరిత్రపై వచ్చిన 'ఏ హెరిటేజ్‌ ఆఫ్‌ జడ్జింగ్‌'కు సంపాదకులు.

పార్టీలకు దూరం..
సుప్రీంకోర్టు జడ్జిగా వారంలో 250 కేసుల ఫైల్స్‌ వరకూ చదవాలి. వాటి అధ్యయనానికి చాలా సమయం పడుతుంది. 'అందుకే పార్టీలకు దూరంగా ఉంటా. ఉదయం మూడున్నరకి నిద్రలేచి కేసుల ఫైళ్లని క్షుణ్ణంగా చదువుతా. 9-10కల్లా ఆ పని పూర్తి చేసి కోర్టుకు వెళ్లడానికి సిద్ధమవుతా. రాత్రి ఎనిమిదికి ఇంటికి వస్తా. రోజూ గంటా, రెండు గంటలు పుస్తకాలు చదవాల్సిందే' అని చెప్పే చంద్రచూడ్‌కి పిల్లులంటే ఇష్టం. ఇంట్లో జోష్‌, జోషువా.. పేరుతో పిల్లులున్నాయి.

విమర్శకురాలు కూడా!
మొదటి భార్య రష్మీ క్యాన్సర్‌తో 2007లో చనిపోయారు. వీరికి ఇద్దరబ్బాయిలు అభినవ్‌, చింతన్‌. అభినవ్‌ బాంబే హైకోర్టులో న్యాయవాది, చింతన్‌ యూకేలో ఓ న్యాయసేవల సంస్థలో పనిచేస్తున్నారు. డీవై చంద్రచూడ్‌ కొన్నాళ్ల కిందట న్యాయవాది కల్పనాదాస్‌ని పెళ్లి చేసుకున్నారు. పెంపుడు కూతుళ్లు మహి, ప్రియాంక ఇద్దరూ దివ్యాంగులు. 'కల్పన నా స్నేహితురాలు, విమర్శకురాలు కూడా' అని చెబుతారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.