ETV Bharat / bharat

పెగసస్​పై దర్యాప్తునకు నిపుణుల కమిటీ ఏర్పాటు- సుప్రీం ఉత్తర్వులు

పెగసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ముగ్గురు సభ్యులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు (Pegasus Supreme Court) సుప్రీంకోర్టు వెల్లడించింది. పెగసస్ స్పైవేర్ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.

supreme court committee
పెగసస్​ స్పైవేర్​ వ్యవహారంపై కమిటీ ఏర్పాటు
author img

By

Published : Oct 27, 2021, 11:09 AM IST

Updated : Oct 27, 2021, 1:28 PM IST

దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించిన పెగసస్‌ స్పైవేర్‌తో ఫోన్ల హ్యాకింగ్‌ వ్యవహారంపై (Pegasus Supreme Court) సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపేందుకు ముగ్గురు సభ్యులతో స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.వి. రవీంద్రన్‌.. ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారని పేర్కొంది. నిపుణుల కమిటీ పనితీరును (Pegasus Supreme Court) తామే పర్యవేక్షిస్తామని స్పష్టం చేసింది. పెగాసస్‌పై వచ్చిన ఆరోపణలను క్షుణ్ణంగా పరిశీలించి.. నివేదికను కోర్టుకు సమర్పించాలని కమిటీని ఆదేశించింది. వ్యక్తుల గోప్యత హక్కు ఉల్లంఘన జరిగిందా లేదా అనే విషయాన్ని ఈ కమిటీ పరిశీలిస్తుందని పేర్కొంది.

తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా..

విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. తప్పనిసరి పరిస్థితుల దృష్ట్యా ఈ కమిటీని ఏర్పాటు చేయాల్సి వచ్చిందని తెలిపింది. దేశ పౌరులపై వివక్షాపూరితమైన నిఘాను (Pegasus Supreme Court) తాము ఎన్నటికీ అనుమతించబోమని స్పష్టం చేసింది. ప్రస్తుత సాంకేతిక శకంలో టెక్నాలజీ ఎంత ముఖ్యమో.. వ్యక్తలు గోప్యత హక్కును కాపాడుకోవడం కూడా అంతే ప్రధానమనే విషయాన్ని గుర్తించాలని పేర్కొంది. పెగసస్‌ స్పైవేర్‌తో పౌరులపై నిఘా పెట్టడం సహా., ఇందులో విదేశీ సంస్థల ప్రమేయం ఉండటంపై ఆందోళన వ్యక్తం చేసింది.

చాలా అవకాశాలు ఇచ్చాం..

పెగసస్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశామన్న (Pegasus Supreme Court) సర్వోన్నత న్యాయస్థానం.. దీనిపై తీసుకున్న చర్యలు, వారి స్పందన గురించి చెప్పేందుకు కేంద్రానికి అనేక అవకాశాలిచ్చామని పేర్కొంది. కానీ.. ప్రభుత్వం మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా అసంపూర్ణంగా అఫిడవిట్ సమర్పించిందని అభిప్రాయపడింది. స్పైవేర్‌ను ఉపయోగించామా లేదా అన్నదానిపై కేంద్రం నుంచి కచ్చితమైన సమాధానం రాలేదన్న కోర్టు.. దేశ భద్రత పేరు చెప్పి సమాచారాన్ని ఇచ్చేందుకు కేంద్రం నిరాకరించిందని వెల్లడించింది. కమిటీ ఏర్పాటుకు కేంద్రం సైతం సుముఖంగా ఉన్న నేపథ్యంలో కమిటీని ఏర్పాటు చేయడం తప్పితే మరో అవకాశం కన్పించలేదని ధర్మాసనం వివరించింది. అనంతరం తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.

ఇదీ జరిగింది..

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలకు ఒక రోజు ముందు పెగసస్‌తో ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పెగసస్‌ స్పైవేర్‌తో లక్ష్యంగా చేసుకున్న వారిలో సుమారు 300 మందికి పైగా భారతీయులు ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్, తృణమూల్‌ కాంగ్రెస్ అగ్రనేత, పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, పలువురు కేంద్రమంత్రులు, పాత్రికేయులు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

ఇదీ చూడండి : Lakhimpur Kheri Violence : లఖింపుర్​ ఘటనలో మరో ఇద్దరు అరెస్ట్​

Last Updated : Oct 27, 2021, 1:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.