ETV Bharat / bharat

మలద్వారం లోపలకు స్టీల్ గ్లాసు.. అలా వెళ్లిందంట! - రహస్య భాగాల్లో స్టీల్ గ్లాసు

steel glass in private part: ఓ వ్యక్తి మలద్వారంలో స్టీల్ గ్లాసు ఇరుక్కుపోయింది. అదే మార్గం గుండా బయటకు తీయడం వైద్యులకు కష్టమైపోయింది. దీంతో సర్జరీ నిర్వహించారు.

steel glass in private part
steel glass in private part
author img

By

Published : Jun 15, 2022, 12:29 PM IST

Updated : Jun 15, 2022, 1:25 PM IST

steel glass in private part: బిహార్ పట్నాలోని పీఎంసీహెచ్ ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స జరిగింది. ఓ మధ్యవయస్కుడైన వ్యక్తి రహస్య భాగాల్లో ఇరుక్కున్న స్టీల్ గ్లాస్​ను వైద్యులు చాకచక్యంగా తొలగించారు. నవాదా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ప్రైవేటు భాగాల్లో స్టీల్ గ్లాస్ ఇరుక్కుంది. ఆయనకు నొప్పి తీవ్రంగా మారింది. బాధితుడి కుటుంబ సభ్యులు అతడిని పీఎంసీహెచ్ ఆస్పత్రిలో శుక్రవారం చేర్పించారు. డాక్టర్ వినయ్ కుమార్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల వైద్య బృందం విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించింది.

steel glass in private part
ఎక్స్​రేలో కనిపిస్తున్న స్టీల్ గ్లాసు

స్టీల్ గ్లాసు.. బాధితుడి మలద్వారంలో చాలా లోతుకు వెళ్లిందని వైద్యులు తెలిపారు. ఎక్స్​రేలో ఈ విషయం స్పష్టంగా తెలిసిందని చెప్పారు. మలద్వారం నుంచి గ్లాసును వెనక్కి తీయడం సాధ్యం కాలేదని తెలిపారు. అందుకే పొట్టకు ఆపరేషన్ నిర్వహించి గ్లాసును బయటకు తీసినట్లు స్పష్టం చేశారు. ఆపరేషన్ పూర్తైన తర్వాత బాధితుడిని పర్యవేక్షణలో ఉంచినట్లు తెలిపారు. కొద్దిగంటల తర్వాత ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు తరలించినట్లు వివరించారు.

బాధితుడికి మతిస్థిమితం సరిగా లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, అతడు తమతో సాధారణంగానే ప్రవర్తించాడని వైద్యులు వెల్లడించారు. 'అన్ని ప్రశ్నలకు బాధితుడు సరిగానే సమాధానాలు చెప్పాడు. స్టీల్ గ్లాసును బోర్లా వేసి.. దానిపై కూర్చున్నట్టు తెలిపాడు. ఆ తర్వాత అది మలద్వారంలోకి వెళ్లిపోయిందని వివరించాడు' అని వైద్యులు చెప్పారు. మరోవైపు, కుటుంబ సభ్యులు ఈ విషయంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. మంత్రాలు ప్రాక్టీస్ చేసేందుకే గ్లాస్​పై కూర్చొని ఉంటాడని చెబుతున్నాడు. ఈ క్రమంలోనే అది లోపలికి వెళ్లిపోయిందని చెబుతున్నారు.

ఇదీ చదవండి:

Last Updated : Jun 15, 2022, 1:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.