ETV Bharat / bharat

అసెంబ్లీ వేదికగా పార్టీ నేతలకు సీఎం హెచ్చరిక - ఎమ్మెల్యేలకు స్టాలిన్​ హెచ్చరిక

కార్యకర్త నుంచి ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు.. పార్టీ అధినేతలపై ప్రశంసలు(sycophancy in politics) కురిపించటం ఏ పార్టీలోనైనా కనిపిస్తుంది. కానీ, అలాంటి వాటికి తమ పార్టీ దూరం అంటున్నారు ఓ ముఖ్యమంత్రి(Tamil Nadu CM). ప్రజా సమస్యలపై చర్చించే అసెంబ్లీలో(Tamil Nadu Assembly) పొగడ్తలతో సమయాన్ని వృథా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కూడా.

Stalin Warns Ministers
ముఖ్యమంత్రి ఎంకే స్టాలి
author img

By

Published : Aug 29, 2021, 11:10 AM IST

Updated : Aug 29, 2021, 1:09 PM IST

పార్టీ అధినేతల్ని పొగడ్తలతో ముంచెత్తి(sycophancy in politics).. తమ ఉనికిని చాటుకోవటం ద్రవిడ రాజకీయాల విశిష్ట లక్షణం. అన్నాడీఎంకే హయాంలో జయలలిత నుంచి ఎడప్పాడి పళనిస్వామి వరకు ఇదే పద్ధతి కొనసాగింది. కానీ, డీఎంకే హయాంలో అలాంటివి కుదరవని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Tamil Nadu CM)​. అందుకు తాను దూరమని పార్టీ(dmk party) ఎమ్మెల్యేలు, మంత్రులను హెచ్చరించారు. అసెంబ్లీలో పార్టీ నాయకత్వాన్ని, ముఖ్యమంత్రిని ప్రశంసిస్తూ.. సమయాన్ని వృథా చేయకుండా సభా కార్యకలాపాలను కొనసాగించాలని చెప్పారు.

అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాల్లో(Tamil Nadu assembly session) భాగంగా.. తమిళనాడు కోర్టు రుసుములు, వ్యాజ్యాల విలువల చట్టం-1955 సవరణ బిల్లు ప్రవేశపెడుతున్న క్రమంలో న్యాయశాఖ మంత్రి ఎస్​ రఘుపతి.. పార్టీ నాయకులపై ప్రశంసలు కురిపించారు. దాంతో.. వ్యక్తి ఆరాధన మానుకోవాలని స్పష్టం చేశారు స్టాలిన్​.

"ప్రతిదానికీ ఓ పరిమితి ఉంది. నేను ప్రతిసారీ దాన్ని గుర్తుచేయలేను. అలాంటివి మానుకోవాలని నేను ఇప్పటికే సూచించాను. అయినా.. కొనసాగిస్తున్నారు. అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెట్టేప్పుడు, ప్రశ్నలు అడుగుతున్నప్పుడు, డిమాండ్లపై చర్చిస్తున్నప్పుడు ప్రశంసిస్తూ మాట్లాడితే వారిపై చర్యలు తీసుకుంటాం. ఇది అభ్యర్థన కాదు, ఆదేశం."

- ఎంకే స్టాలిన్​, తమిళనాడు ముఖ్యమంత్రి.

ఆగస్టు 13న తమిళనాడు అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్​ 21 వరకు నిర్వహించాల్సి ఉన్నా.. రాజ్యసభ ఎన్నికలు ఉన్నందున సెప్టెంబర్​ 13నే ముగించాలని నిర్ణయించారు.

ఇదీ చూడండి: ఆ ఫైల్​పై సీఎంగా స్టాలిన్ తొలి సంతకం

Last Updated : Aug 29, 2021, 1:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.