SSB Constable Jobs 2023 : పోలీసు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఆశావాహులకు శుభవార్త. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన న్యూదిల్లీలోని డైరెక్టరేట్ జనరల్, సశస్త్ర సీమ బల్(ఎస్‌ఎస్‌బీ) 2023 సంవత్సరానికి సంబంధించి స్పోర్ట్స్ కోటా కింద 272 కానిస్టేబుల్ పోస్టుల(SSB Constable Recruitment 2023)ను భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత ఉండి ఆసక్తిగల యువతీయువకులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టులు..
SSB Constable General Duty Vacancy : కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ), గ్రూప్-సి నాన్-గెజిటెడ్- 272 పోస్టులు
విద్యార్హతలు..
SSB Constable Eligibility : అభ్యర్థులు పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే నిర్దేశించిన క్రీడా ఈవెంట్లలో పాల్గొని ఉండాలి.
ఏజ్ లిమిట్(SSB Constable Jobs Age Limit)..
- ఈ కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి.
- నిబంధనల ప్రకారం అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
ఈ క్రీడా ఈవెంట్లలో..
SSB Constable Vacancy 2023 : ఆర్చరీ, అథ్లెటిక్స్, బాక్సింగ్, బాడీ బిల్డింగ్, బాస్కెట్‌బాల్, సైక్లింగ్, ఈక్వెస్ట్రియన్, ఫెన్సింగ్, జిమ్నాస్టిక్స్, హాకీ, జూడో, కబడ్డీ, కరాటే, పెన్‌కాక్ సిలాట్, పవర్‌లిఫ్టింగ్, షూటింగ్ స్పోర్ట్స్, స్విమ్మింగ్, తైక్వాండో, వాలీబాల్, రెజ్లింగ్, ఉషూ, వాటర్ స్పోర్ట్స్, వెయిట్ లిఫ్టింగ్.
ఎంపిక ప్రక్రియ(SSB Constable Jobs Selection Process)..
- క్రీడా విజయాలు
- రాత పరీక్ష
- ఫీల్డ్ ట్రయల్
- స్కిల్ టెస్ట్
- ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్
- డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్
- రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
జీత భత్యాలు..
SSB Constable Salary : ఉద్యోగానికి ఎంపికైన వారికి రూ.21,700 నుంచి రూ.69,100 వరకు వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు రుసుము(SSB Constable Jobs Application Fees)..
- ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు కల్పించారు. వీరు ఎటువంటి రుసుము చెల్లించకుండా పూర్తి ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
- మిగతా కేటగిరీల అభ్యర్థులు(జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ) రూ.100ను దరఖాస్తు రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది.
జాబ్ లొకేషన్..
SSB Constable Job Location : ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు దేశంలో లేదా భారత భూభాగం వెలుపల తమ విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది.
అధికారిక వెబ్సైట్..
SSB Official Website : నోటిఫికేషన్‌కి సంబంధించి మరిన్ని వివరాల కోసం SSB అధికారిక వెబ్సైట్ http://ssbrectt.gov.in/ను వీక్షించవచ్చు.
ఇలా అప్లై చేసుకోండి..!
How To Apply For SSB Constable Jobs :
- ముందుగా www.ssbrectt.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
- ఆ తరువాత హోమ్ పేజీలో కనిపించే 'SSB Constable (General Duty) Recruitment 2023 Apply online link'పై క్లిక్ చయండి.
- అప్లికేషన్ ఫారాన్ని పూర్తిగా నింపండి.
- కావాల్సిన అన్ని డాక్యుమెంట్లను నిర్దేశించిన సైజు, ఫార్మాట్లో స్కాన్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ కేటగిరీ ఆధారంగా అప్లికేషన్ ఫీజును చెల్లించండి.
- చివరగా 'Submit Application Form'పై నొక్కండి. దీంతో మీ దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. రిఫరెన్స్ కోసం దరఖాస్తు ఫారాన్ని ప్రింట్ అవుట్ తీసుకొని పెట్టుకోండి.
దరఖాస్తుకు చివరితేది..
2023 నవంబర్ 20
CNP ITI Jobs 2023 : ఐటీఐ అర్హతతో.. కరెన్సీ నోట్ ప్రెస్‌లో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా!