ETV Bharat / bharat

'నా విజయం బిహార్​ యువకులకు ప్రేరణ లాంటిది' - యూపీఎస్పీ సివిల్స్​ ఫలితాలు

యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్​ పరీక్షలు 2020లో(upsc civil services result 2020) టాపర్​గా నిలిచారు బిహార్​కు చెందిన శుభం కుమార్​. ఇది ఆరంభం మాత్రమేనని తెలిపారు. సివిల్స్​ టాపర్​ శుభంతో ఈటీవీ భారత్​ ప్రత్యేక ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా పలు విషయాలు వెల్లడించారు శుభం.

shubham-kumar
సివిల్స్‌ టాపర్‌ శుభంకుమార్‌
author img

By

Published : Sep 25, 2021, 12:26 PM IST

సివిల్స్ టాపర్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి

యూపీఎస్సీ పరీక్షల్లో(upsc civil services) టాపర్‌గా నిలవటం ఆరంభం మాత్రమేనని సివిల్స్‌ టాపర్‌ శుభంకుమార్‌(UPSC civils topper) తెలిపారు. తదుపరి ఏ బాధ్యతలు అప్పగించినా సమర్థంగా నిర్వహిస్తానన్నారు. గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేసే అవకాశం వస్తే సంతోషిస్తానని తెలిపారు. మూడో ప్రయత్నంలో సివిల్స్‌ టాపర్‌గా నిలిచారు బిహార్‌కు చెందిన 24 ఏళ్ల శుభం కుమార్‌. ఈటీవీ భారత్​ ముఖాముఖిలో పలు విషయాలు వెల్లడించారు శుభం.

shubham-kumar
స్నేహితులతో శుభం కుమార్​
  • ప్రశ్న: శుభం సివిల్స్‌లో మొదటి ర్యాంక్‌ సాధించినందుకు ఈటీవీ తరఫున అభినందనలు. ఈ విజయంపై మీ స్పందనేంటి..?
    జవాబు: మీకు కృతజ్ఞతలు. చాలా సంతోషంగా ఉంది. కుటుంబసభ్యులు, స్నేహితులు అందరూ హర్షం వ్యక్తం చేశారు.
  • ప్రశ్న: మీ ప్రయాణం ఎలా సాగింది. మీ స్వస్థలం ఎక్కడ..? మీ అమ్మనాన్న ఏం చేస్తారు..?
    జవాబు: నాది కటిహార్‌ జిల్లా కుమ్రి గ్రామం. మా ఇంట్లో అమ్మానాన్న, చిన్నాన్న చిన్నమ్మ ఉంటారు. 2014-18 మధ్య ఐఐటీ బాంబేలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశా. 2018 నుంచి సివిల్స్‌ ప్రయత్నాలు మొదలుపెట్టా. దిల్లీలో రెండేళ్లు ఉన్నా. గతేడాది ఇండియన్‌ డిఫెన్స్‌ అకౌంట్స్‌ సర్వీస్‌కు ఎంపికయ్యా. ప్రస్తుతం పుణెలో శిక్షణ కొనసాగుతోంది.
  • ప్రశ్న: మీ అమ్మానాన్న ఏం చేస్తారు..? సివిల్స్‌ ప్రయత్నాలు ఎప్పట్నుంచి మొదలయ్యాయి..?
    జవాబు: మా నాన్న ఉత్తర బిహార్‌ గ్రామీణ బ్యాంక్‌లో మేనేజర్‌. అమ్మ గృహిణి. చిన్నప్పటి నుంచి నాకు సివిల్స్‌ రాయాలనే కల ఉండేది. ఐఐటీ బాంబే చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు
    యూపీఎస్సీలో ప్రవేశించి ప్రజలకు సేవ చేయాలని కోరిక కలిగింది.
  • ప్రశ్న: 24ఏళ్ల యువకుడు.. అది బిహార్‌కు చెందినవాడు సివిల్స్‌లో టాపర్‌గా నిలవటం చిన్న విషయం కాదు. సివిల్స్‌ టాపర్‌ అని తెలిసినప్పుడు ఏమనిపించింది...?
    జవాబు: చాలా సంతోషమనిపించింది. ఇంకా చాలామంది కూడా సివిల్స్‌కు ఎంపికయ్యారు. నా విజయం బిహార్‌ యువకులను సానుకూల ప్రేరణగా నిలుస్తుంది.
  • ప్రశ్న: మీ తదుపరి లక్ష్యం ఏమిటి..?
    జవాబు: ఇది ఆరంభం మాత్రమే. నాకు ఏ బాధ్యతలు అప్పగించినా సమర్థంగా నిర్వహిస్తా. గ్రామీణాభివృద్ధి కోసం పనిచేసే అవకాశం వస్తే సంతోషిస్తా.
  • ప్రశ్న: బిహార్‌ సీఎంసహా దేశం నలుమూలల నుంచి మీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మీరేమంటారు...?
    జవాబు: నేను చాలా అదృష్టవంతుణ్ని. అందరికీ కృతజ్ఞతలు.

ఇదీ చూడండి: సివిల్స్ ఫలితాలు విడుదల- టాపర్​గా శుభమ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.