బిహార్‌లో దారుణం జరిగింది. చిన్న పిల్లల గొడవ ముదిరి పెద్దోళ్ల తగాదా వరకు వెళ్లింది. ఆ పెద్దోళ్ల గొడవ ఓ రెండేళ్ల బాలుడి ప్రాణం బలి తీసుకుంది. రెండేళ్ల చిన్నారిని ఇద్దరు వ్యక్తులు తన తండ్రి ఎదుటే చంపేశారు. ఈ ఘటన భరత్ పుర్ జిల్లాలోని జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. ఖజారియా జిల్లా అగ్వని పార్బట్ట గ్రామానికి చెందిన పవన్.. తన కుటుంబ సభ్యులతో కలిసి బారారై పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్నాడు. ఆ పరిసరాల్లోనే మనోజ్ దామ్ అనే వ్యక్తి కూడా నివాసం ఉంటున్నాడు. కొద్ది రోజుల క్రితం పవన్.. మనోజ్ పిల్లలతో ఓ గేమ్ కారణంగా గొడవ పడ్డాడు. ఆ గొడవ కాస్త ముదిరి మనోజ్ వద్దకు వెళ్లింది. అనంతరం పవన్.. మనోజ్ మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పవన్ పిల్లల్ని చంపేస్తానని బెదిరించాడు మనోజ్.
ఆ తర్వాత మనోజ్ అతడి స్నేహితుడితో గురువారం పవన్ ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత పవన్ ముందే అతడి రెండేళ్ల బాలుడిపై కత్తితో దాడి చేశాడు. అనంతరం చిన్నారిని గట్టిగా పట్టుకుని పైకి లేపాడు. బాలుడు ఎంత అరిచినా విడిచిపెట్టలేదు.. దీంతో ఊపిరి ఆడకపోవడం వల్ల బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనలో పవన్ కూడా గాయపడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం చిన్నారి మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
రైల్వేట్రాక్‌పై మృతదేహం కలకలం..
కర్ణాటకలోని కుంతపుర రైల్వే ట్రాక్‌పై మృతదేహం కలకలం రేపింది. అయితే అతడిపై ఇదివరకే పోలీస్ స్టేషన్లో ఓ కేసు నమోదవడం గమనార్హం. ట్రాక్‌పై పడి ఉన్న మృతదేహన్ని కాసరగోడ్ జిల్లా బాదియతుక్క ప్రాంతానికి చెందిన మలయాళీ డెంటిస్ట్ కృష్ణమూర్తి(52)గా గుర్తించారు.
నవంబర్ 8న ఓ మహిళ తనతో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలతో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కృష్ణమూర్తిపై కేసు నమోదైంది. అదే రోజు మధ్యాహ్నం తన ఫోన్‌ను క్లినిక్‌లోనే వదిలేసి.. డాక్టర్ బయటకు వెళ్లిపోయాడు. బైక్‌ను కుంబాలా అనే ప్రాతంలో విడిపెట్టాడు. అనంతరం తిరిగి రాలేదు.
నవంబర్ 10న కర్ణాటకలోని కుంతపుర రైల్వే ట్రాక్‌పై ఓ మృతదేహం లభ్యమైంది. దుస్తుల ఆధారంగా బంధువులు మృతదేహాన్ని గుర్తుపట్టారు. అయితే డాక్టర్ ఏ తప్పు చేయలేదని.. అతడిపై తప్పుడు కేసు బనాయించారని అతడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతుడు కనిపించకుండా పోయిన తర్వాత వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై కేసు నమోదు అయిందనే మనస్తాపంతో.. మృతుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. కాగా డాక్టర్‌పై ఆరోపణలు చేసిన మహిళ సోదరుడితో పాటు క్లినిక్ వచ్చి బెదిరించిన మరో నలుగురిని బధియదుక్క పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆత్మహత్యకు పురిగొల్పారనే ఆరోపణలతో వారిపై కేసు నమోదు చేశారు.
ఇవీ చదవండి: మూత్రపిండంలో రాళ్లొచ్చాయని ఆస్పత్రికి వెళ్తే.. కిడ్నీ మాయం!
మైనర్‌పై రిక్షా డ్రైవర్ల గ్యాంగ్‌రేప్.. స్కూల్ ఫీజు కట్టలేదని వేధింపులు.. ఫ్యాన్‌కు ఉరేసుకుని..