ETV Bharat / bharat

సిద్ధూ ప్రమాణ స్వీకారానికి వెళ్తుంటే ప్రమాదం- ఐదుగురు మృతి - siddu as punjab pcc chief ceremony accident

రెండు బస్సులు ఢీ
Moga accident
author img

By

Published : Jul 23, 2021, 10:03 AM IST

Updated : Jul 23, 2021, 10:32 AM IST

09:57 July 23

రెండు బస్సులు ఢీ - ఐదుగురు మృతి

పంజాబ్ మోగాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. 

ఇందులో ఒక బస్సు.. పంజాబ్​ రోడ్డు రవాణా సంస్థకు చెందినది కాగా.. మరో బస్సు ప్రైవేట్ వాహనం​ అని మోగా ఎస్​ఎస్​పీ హరంబీర్​ సింగ్​ తెలిపారు.  గాయపడ్డవారిని వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ప్రైవేట్​ బస్సులో ఉన్న వారంతా..  నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ పీసీసీ చీఫ్​గా ప్రమాణస్వీకారం చేసే కార్యక్రమానికి వెళ్తున్నారని పేర్కొన్నారు. 

సీఎం విచారం..

మోగా ప్రమాద ఘటనపై పంజాబ్​ ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​ విచారం వ్యక్తం చేశారు. గాయపడ్డవారికి తక్షణమే పూర్తి వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంపై పూర్తి నివేదికను ప్రభుత్వానికి పంపాలని సూచించారు.

Last Updated : Jul 23, 2021, 10:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.