ETV Bharat / bharat

బాలుడిని కాటేసిన విషసర్పం.. క్షణాల్లోనే ఆ పాము మృతి! - బిహార్​ న్యూస్​

Snake Died after biting Child: ఓ పాము నాలుగేళ్ల బాలుడిని కరిచిన వెంటనే చనిపోయింది. ఈ ఘటన బిహార్​లోని గోపాల్​గంజ్​లో బుధవారం జరిగింది. కాగా బాలుడు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Snake Died after biting Child
Snake Died after biting Child
author img

By

Published : Jun 23, 2022, 9:02 AM IST

Updated : Jun 23, 2022, 9:11 AM IST

Snake Died after biting Child: సాధారణంగా పాము కరిస్తే మనుషులు మరణించిన ఘటనలు ఎన్నో చూసుంటాం. కానీ ఇక్కడ మాత్రం ఓ పాము.. నాలుగేళ్ల బాలుడిని కరిచి క్షణాల్లోనే మృతిచెందింది. ఈ ఘటన బిహార్​లోని గోపాల్​గంజ్​లో బుధవారం జరిగింది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు బాలుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. బాలుడు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం చుట్టుపక్కల ప్రాంతాలకు తెలియడం వల్ల అనేక మంది బాలుడిని చూడడానికి వచ్చారు.

ఇదీ జరిగింది: బరౌలి పోలీస్​ స్టేషన్​ పరిధిలోని మధోపుర్​ గ్రామానికి చెందిన రోహిత్​ కుశ్వాలాకు నాలుగేళ్ల అనూజ్​ కుమార్​ అనే కుమారుడు ఉన్నాడు. అనూజ్​ తన తల్లితో సహా కుచాయ్​కొట్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నారు. ఈ క్రమంలోనే అనూజ్​.. ఇంటి ముందు ఆడుకుంటుండగా.. అకస్మాత్తుగా ఓ విషసర్పం కాటు వేసింది. అయితే అతడిని కరిచిన కొద్ది క్షణాల్లోనే పాము చనిపోయింది. బాలుడు ఏడవడం గమనించిన కటుంబసభ్యులు అడగగా.. పాము కరిచిన విషయాన్ని చెప్పాడు. ఘటన స్థలానికి వెళ్లి చూడగా పాము చనిపోయి ఉంది. ఆ పామును డబ్బాలో తీసుకుని ఆస్పత్రికి వెళ్లారు. కాగా ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది.

ఇదీ చదవండి: భార్యకు ముద్దుపెట్టాడని భర్తను కొట్టారు.. కారణమేంటి?

Last Updated : Jun 23, 2022, 9:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.