ETV Bharat / bharat

నాలుగేళ్ల చిన్నారిని కిడ్నాప్​ చేసి రేప్.. మైనర్​ కుమార్తెను గర్భవతిని చేసిన తండ్రి - 42 year old father raped minor daughter

దిల్లీలో నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు, మైనర్​ కుమార్తెపై 42 ఏళ్ల తండ్రి అత్యాచారం చేశాడు. బాలిక గర్భం దాల్చగా.. విషయం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలో ఈ దారుణం జరిగింది. పంజాబ్​లో ఆరేళ్ల బాలుడిపై 19 ఏళ్ల యువకుడు అత్యాచారం చేశాడు.

19 year old boy rape with 6 year old boy

author img

By

Published : Dec 22, 2022, 10:05 PM IST

దేశ రాజధాని దిల్లీలో అమానవీయ ఘటన జరిగింది. నాలుగేళ్ల చిన్నారిని కిడ్నాప్​ చేసి, అత్యాచారం చేశాడు ఓ దుర్మార్గుడు. ప్రస్తుతం ఆ బాలిక విషమ పరిస్థితుల్లో చికిత్స పొందుతోంది. భల్స్వా డెయిరీ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఈ దారుణం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బాధిత బాలికను గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేశాడు. రాత్రంతా బాలిక కోసం కుటుంబ సభ్యులు తీవ్రంగా గాలించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. గురువారం ఉదయం 8 గంటలకు కుటుంబ సభ్యులకు పోలీసుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. బాలిక భల్స్వా చెరువు వద్ద అపస్మారక స్థితిలో ఉందని.. ప్రస్తుతం బాబు జగ్జీవన్ రామ్ హాస్పిటల్ చికిత్స పొందుతుందని వాళ్లకు సమాచారం అందింది. ఆసుపత్రికి చేరుకున్న కుటుంబ సభ్యులకు బాలిక అత్యాచారానికి గురైందని తెలిసింది. తర్వాత బాధిత బాలిక పరిస్థితి మరింతగా విషమించింది. దీంతో ఆమెను అంబేడ్కర్ హాస్పిటల్​కు తరలించారు. కాగా, ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

మైనర్​ కుమార్తె. 42 ఏళ్ల తండ్రి అత్యాచారం..
మహారాష్ట్రలో ఘోరం జరిగింది. కన్న తండ్రే(42) మైనర్​ కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత బాలిక గర్భం దాల్చిన తర్వాతే.. తండ్రి జరిపిన అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద అభియోగాలు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఆరేళ్ల బాలుడిపై యువకుడు అత్యాచారం..
పంజాబ్​లో దారుణం జరిగింది. ఆరేళ్ల బాలుడిపై 19 ఏళ్ల యువకుడు అత్యాచారం చేశాడు. అమృత్‌సర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కాగా బాధిత బాలుడు ప్రస్తుతం జిల్లా సివిల్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా నిందితుడిపై కేసు నమోదు చేసి, అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలుడిని నిందితుడు తన ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలుడి కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలిసింది. ఆ తర్వాత బాధితున్ని ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా బాధితుడికి డబ్బు చెల్లిస్తామని, కేసు వాపసు తీసుకోవాల్సిందిగా బాలుడి కుటుంబ సభ్యులను కోరారు నిందితుడు. అందుకు బాధితుడికి కుటుంబ సభ్యులు నిరాకరించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.