ETV Bharat / bharat

కాలువలోకి దూసుకెళ్లిన 'పెళ్లి కారు'.. ఆరుగురు మృతి - రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

Six killed in car accident: వివాహ వేడుకల నుంచి తిరిగివస్తూ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. ఈ విషాద ఘటన బిహార్​లోని ఔరంగాబాద్​ జిల్లాలో జరిగింది. కారు అదుపు తప్పడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

car accident
car accident
author img

By

Published : May 15, 2022, 3:37 PM IST

Six killed in car accident: పెళ్లి నుంచి తిరిగివస్తుండగా జరిగిన కారు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బిహార్​లోని ఔరంగాబాద్​ జిల్లా అకోనీ గ్రామం సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. మృతులు.. ఝార్ఖండ్​లోని పాలము జిల్లాకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో వ్యక్తికి వారణాసి బీహెచ్​యూ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ఇదీ జరిగింది.. ఝార్ఖండ్​ పాలము జిల్లాకు చెందిన ఏడుగురు.. బిహార్​లోని నబీనగర్​లోని ఓ వివాహానికి హాజరై ఆదివారం తెల్లవారుజామున తిరుగు ప్రయాణమయ్యారు. తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో అకోనీ గ్రామం సమీపానికి చేరుకునే సరికి కారు అదుపు తప్పింది. ఈ క్రమంలో ఆ కారు అక్కడే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా.. మిగతా ఇద్దరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కానీ దురదృష్టవశాత్తు వీరిలో ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.

మృతులలో ఐదుగురిని.. ఖాతిన్​కు చెందిన రంజిత్​ కుమార్​, ఖాజురీకు చెందిన అభయ్​కుమార్, సద్మాకు చెందిన అక్షయ్​ కుమార్​, ఛత్తర్​పుర్​కు చెందిన శుభమ్​ కుమార్​, బబ్లూ కుమార్​గా గుర్తించారు. మరణించిన మరో వ్యక్తి.. చికిత్స పొందిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి : 'హత్య' కేసులో మాజీ మంత్రి కుమార్తె పరార్​.. రేప్​ కేసులో మంత్రి కుమారుడు...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.