ETV Bharat / bharat

బిడ్డను ఒంటికి కట్టుకుని.. ఆటో నడుపుతూ..'ఆమె' బతుకు పోరాటం - chanchal sharma noida

జీవితాంతం కలిసి ఉంటాడనుకున్న భర్త మధ్యలోనే వదిలేశాడు. దీంతో కన్న కొడుకుతో ఆమె రోడ్డున పడింది. వృద్ధురాలైన తల్లి, ముగ్గురు తోబుట్టువులపై ఆధారపడకూడదని.. తన కాళ్లపై తాను నిలబడేందుకు ఈ-రిక్షా నడపాలని నిర్ణయించుకుంది. నిజాయితీగా చేసే ఏపనీ తక్కువ కాదంటూ నిండైన ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తోన్న ఆ మహిళ గురించి తెలుసుకుందాం రండి..

single-mother-drives-e-rickshaw-with-son-in-noida

author img

By

Published : Oct 27, 2022, 10:22 PM IST

బిడ్డను ఒంటికి కట్టుకుని ఆటో నడుపుతూ బతుకు పోరాటం చేస్తున్న మహిళ

పల్లెల్లో బిడ్డను నడుముకు కట్టుకుని కూలి పనులు చేసే తల్లులను మనం చూసే ఉంటాం. కానీ విశాలమైన నగరంలో బిడ్డను ఒంటికి కట్టుకుని ఆటో రిక్షా నడుపుతూ బతుకు పోరాటం చూస్తున్న ఇలాంటి తల్లిని ఎప్పుడూ చూడకపోయి ఉంటాం. ఇటీవల ఈమె గురించి సోషల్‌ మీడియాలో చాలా మంది మాట్లాడుకున్నారు. అనేక మంది మెచ్చుకున్నారు. అసలు ఆమె ఎవరు?

దిల్లీలోని నోయిడాకు చెందిన చంచల్​ శర్మ(27)అనే మహిళ.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చాక ఆమె భర్త వదిలేశాడు. దీంతో కన్నకొడుకుతో ఆమె రోడ్డున పడింది. ఆమెకు ఉన్న ముగ్గురు తోబుట్టువులు.. పెళ్లిళ్లు చేసుకుని తమ కుటుంబాలతో ఉన్నారు. ఒకవైపు భర్త తోడు లేకపోవడం, మరోవైపు బిడ్డ బాధ్యత ఆమెను సతమతం చేశాయి. జీవితంలో ఓడిపోవడమా? పోరాడి నిలవడమా? అని ఆలోచించింది. రెండో మార్గాన్నే ఆమె ఎంచుకుంది.

కొడుకు నెలల బిడ్డగా ఉండగా తల్లి దగ్గరే వదిలి ఈ-ఆటో రిక్షా నడపడం మొదలుపెట్టింది. కానీ ఇప్పుడు ఆ పిల్లాడికి సంవత్సరం నిండింది. తల్లి కోసం బెంగ పెట్టుకుంటాడు. అదీగాక తల్లి ఆ పిల్లాడ్ని చూసుకోలేకపోతోంది. కేర్​ సెంటర్​లో వేద్దామంటే అందుకు కట్టాల్సినంత డబ్బు తన వద్ద లేదు. పైగా కేర్​ సెంటర్​లు కూడా బాగా ఛార్జ్‌ చేస్తున్నాయి. అందుకే తనతోపాటే కొడుకును నడుముకు కట్టుకుని ఈ-రిక్షా నడపాలని నిశ్చయించుకుంది చంచల్‌ శర్మ.

single-mother-drives-e-rickshaw-with-son-in-noida
చంచల్​ శర్మ

ప్రతిరోజూ 6.30 గంటలకల్లా తన కొడుకును చున్నీతో ఛాతీకి కట్టుకుని.. సెక్టార్‌-62 లోని మెట్రో ఎలక్ట్రానిక్‌ సిటీకి వస్తుంది. అక్కడ రోజుకు రూ.300కి ఈ-రిక్షాను అద్దెకు తీసుకుని నడుపుతోంది. ఇలా రోజుకు రూ.600 నుంచి రూ.700 వరకూ సంపాదిస్తోంది. నిజాయితీగా చేసే ఏపనీ తక్కువ కాదంటూ నిండైన ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది.

ఒక్కోసారి కొడుకు పొట్ట మీదే నిద్రపోతాడు. ఒక్కోసారి మేలుకుని హుషారుగా ఉంటాడు. కొన్నిసార్లు ఏడుస్తూనే ఉంటాడు. కానీ ప్యాసింజర్లు విసుక్కోరు. ఆమెను సానుభూతితో అర్థం చేసుకుంటారు. మహిళలయితే ఆమె ఆటోనే వెతికి మరీ ఎక్కుతారు. తన బిడ్డ కోసం తాను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానంటోంది చంచల్‌ శర్మ. "నిజాయితీగా కష్టపడి చేసే ఏ పనిని తక్కువగా భావించకూడదు. ముఖ్యంగా మహిళలు ఎవరిపైనా ఆధారపడకూడదు. సొంతంగా కష్టపడాలి" అని ఈటీవీ భారత్​తో తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.