ETV Bharat / bharat

ఆర్మీలో స్పెషల్ కొలువులు.. NCC సర్టిఫికెట్ ఉంటే జాబ్ పక్కా! జీతం రూ.56వేల పైనే - NCC Special Entry Jobs 2023

NCC Special Entry Jobs 2023 : ఇండియన్​ ఆర్మీలో ఉద్యోగం చేయాలని అనుకునే వారికి గుడ్​ న్యూస్​. డిగ్రీ పూర్తి చేసి ఎన్​సీసీలో 'సీ' గ్రేడ్​ సర్టిఫికేట్​ ఉన్న అభ్యర్థుల కోసం స్పెషల్‌ ఎంట్రీ స్కీం కింద ఓ జాబ్​ నోటిఫికేషన్​ విడుదలైంది. మరి అది ఏ పోస్టు, మొత్తం ఖాళీలు ఎన్ని, జీతం ఎంత, దరఖాస్తు చివరి తేదీ వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం.

NCC Special Entry Jobs 2023
ఆర్మీలో కొలువులు.. ఆ సర్టిఫికేట్​ ఉన్నవారికి మాత్రమే 'స్పెషల్​ ఎంట్రీ'..
author img

By

Published : Jul 19, 2023, 12:45 PM IST

NCC Special Entry Jobs 2023 : దేశ సేవ చేయాలని అనుకునే పౌరుల కోసం ఇండియన్​ ఆర్మీ శుభవార్త వినిపించింది.​ ఏ స్ట్రీమ్​లోనైనా డిగ్రీ పూర్తి చేసి నేషనల్‌ క్యాడెట్‌ కోర్‌ (ఎన్‌సీసీ) 'సీ' గ్రేడ్​ సర్టిఫికేట్​ ఉన్న అభ్యర్థుల కోసం 'ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ' పథకంలో భాగంగా ఓ ఉద్యోగ నోటిఫికేషన్​ను ఇటీవలే విడుదల చేసింది. కాగా, షార్ట్​ సర్వీస్​ కమిషన్​ ప్రతి ఏడాది నేషనల్‌ క్యాడెట్‌ కోర్‌ (ఎన్‌సీసీ) సర్టిఫికెట్‌ ఉన్నవారికి ప్రవేశాలు, ఉద్యోగాల్లో కొన్ని సీట్లను ప్రత్యేకంగా కేటాయిస్తూ వస్తోంది. ఆర్మీ అయితే వీరికోసమే ప్రత్యేకంగా నియామకాలు చేపడుతోంది. ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ పేరుతో ఏడాదికి రెండుసార్లు ప్రకటనలు విడుదల చేస్తోంది.

ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ ప్రకటన పూర్తి వివరాలు..
పోస్టు: ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ
ఎవరు అర్హులు..
NCC Special Entry Eligibility : పెళ్లి కాని గ్రాడ్యూయేట్​లు ఎన్‌సీసీ అర్హత సర్టిఫికేట్​ ఉన్నవారు మాత్రమే ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే వీరు ఏదైనా స్ట్రీమ్​లో కనీసం 50 శాతం మార్కుల ఉత్తీర్ణతతో డిగ్రీ పట్టా పొంది ఉండాలి. అలాగే మూడు అకాడమిక్‌ సంవత్సరాలు ఎన్‌సీసీ సీనియర్‌ డివిజన్‌ వింగ్‌లో కొనసాగి ఉండాలి. అలాగే ఎన్‌సీసీ 'సీ' సర్టిఫికెట్‌లో కనీసం 'బీ' గ్రేడ్‌ పొందాలి. యుద్ధంలో మరణించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు ఎన్‌సీసీ 'సీ' సర్టిఫికెట్‌ తప్పనిసరి కాదు.

పెళ్లికాని వారికి మాత్రమే..
NCC Special Entry Details : ఈ స్కీం కింద దరఖాస్తు చేసుకోవాలంటే పురుషులు సహా మహిళలు అవివాహితులు అయి ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా వీరిని ఎంపిక చేసి శిక్షణను ఇస్తారు. ఇందులో విజయవంతమైతే లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లో చేరిపోవచ్చు. అంతేకాకుండా వీరికి ఆకర్షణీయ జీతంతో పాటు ప్రోత్సాహకాలూ ఉంటాయి.

ఎలా ఎంపిక చేస్తారు?
NCC Special Entry Selection Process : ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ స్కీం కింద వచ్చిన దరఖాస్తులను అభ్యర్థులు పొందిన అకాడమిక్‌ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్టు చేస్తారు. ఇలా వడపోతలో నిలిచినవారికి సెలక్షన్‌ కేంద్రాల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఏపీ, తెలంగాణకు చెందిన అభ్యర్థులకు బెంగళూరులో ఇంటర్వ్యూ ఉంటుంది. సైకాలజిస్ట్, గ్రూప్‌ టెస్టింగ్‌ ఆఫీసర్, ఇంటర్వ్యూ ఆఫీసర్‌ ఆధ్వర్యంలో రెండు దశల్లో ఐదు రోజులపాటు ముఖాముఖి జరుగుతుంది. తొలిరోజు స్టేజ్‌-1లో ఉత్తీర్ణులుగా నిలిచిన వారికే తర్వాతి 4 రోజుల స్టేజ్‌-2లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. ఇందులోనూ విజయవంతమైతే వైద్య పరీక్షలు నిర్వహించి, శిక్షణకు ఎంపిక​ చేస్తారు.

అవసరాలు, ఆసక్తుల మేరకు పొడిగింపు..
NCC Special Entry Duration : ఎంపికైన అభ్యర్థులకు 2024 ఏప్రిల్ నుంచి చెన్నై-ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో 49 వారాలు శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో ప్రతి నెలా రూ.56,100 స్టైపెండ్​ను చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారికి పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ డిఫెన్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌ డిగ్రీని మద్రాస్‌ యూనివర్సిటీ ప్రదానం చేస్తుంది. అనంతరం లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఇలా చేరినవారు పదేళ్లు ఉద్యోగంలో కొనసాగవచ్చు. ఆ తర్వాత సంస్థ అవసరాలు, అభ్యర్థుల ఆసక్తుల ప్రకారం కొందరిని శాశ్వత ఉద్యోగం (పర్మనెంట్‌ కమిషన్‌)లోకి తీసుకుంటారు. మిగిలినవారికి మరో నాలుగేళ్లు సర్వీస్​ను పొడిగిస్తారు. అనంతరం వీరు రిటైరవుతారు. లెఫ్టినెంట్‌గా విధుల్లో చేరినవారు రెండేళ్ల అనుభవంతో కెప్టెన్, ఆరేళ్లకు మేజర్, 13 ఏళ్ల సేవలతో లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాకు చేరుకోవచ్చు. వీరికి రూ.56,100 మూలవేతనంతోపాటు మిలిటరీ సర్వీస్‌ పే, డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు అందుతాయి. తొలి నెల నుంచే రూ.లక్షకు పైగా జీతం పొందవచ్చు. దీంతో పాటు పలు ప్రోత్సాహకాలూ ఉంటాయి.

ఇన్ని ఖాళీలు:
NCC Special Entry Vacancy : మొత్తం 55 ఖాళీలు. ఇందులో 50 పురుషులకు, 5 మహిళలకు కేటాయించారు. అలాగై ఈ రెండు విభాగాల్లోనూ 6 (పురుషులు 5, మహిళలు 1) పోస్టులు యుద్ధంలో అమరులైన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు దక్కుతాయి.

ఈ వయసు ఉంటేనే:
NCC Special Entry Age Limit : 2024, జనవరి 1 నాటికి 19 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. 1999, జనవరి 2 - 2005, జనవరి 1 మధ్య జన్మించినవారు మాత్రమే అర్హులు.

అప్లికేషన్​ చివరితేదీ..
NCC Special Entry 2023 Last Date : ఆగస్టు 3 మధ్యాహ్నం 3 వరకు ఆన్‌లైన్​లో దరఖాస్తులను స్వీకరిస్తారు.

శిక్షణ ప్రారంభం..
NCC Special Entry Training : ఎంపికైన అభ్యర్థులకు 2024, ఏప్రిల్​​ నుంచి శిక్షణను ప్రారంభిస్తారు. పూర్తి వివరాల కోసం www.Joinindianarmy.nic.in వెబ్​సైట్​ను వీక్షించొచ్చు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.