ETV Bharat / bharat

'ఆ మాత్రలకు మాదక ద్రవ్యాల చట్టం వర్తించదు' - వీర్య వృద్ధికి ఉద్దేశించిన వనమూలిక మాత్రలు

NDPS Act: 'మాదకద్రవ్యాల చట్టం' పరిధిలోకి పురుషుల్లో వీర్య వృద్ధికి ఉద్దేశించిన వనమూలిక మాత్రలు రావని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ఓ అరెస్టైన ఓ వ్యక్తికి బెయిల్‌ మంజూరు చేయడానికి అవకాశాలను పరిశీలించాలని ట్రయల్‌ కోర్టుకు సూచించింది.

NDPS Act
మాదకద్రవ్యాల చట్టం
author img

By

Published : Dec 14, 2021, 6:34 AM IST

NDPS Act: పురుషుల్లో వీర్య వృద్ధికి ఉద్దేశించిన వనమూలిక మాత్రలకు 'మాదకద్రవ్యాల చట్టం' వర్తించదని సోమవారం స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఈ మాత్రలు కలిగి ఉన్నారన్న కారణంతో తమిళనాడుకు చెందిన కొందరు వ్యక్తులను డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు అరెస్టు చేశారు. ఆ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. అయితే అందులో ఒకరికి గత ఏడాది నవంబరులో ట్రయల్‌ కోర్టు బెయిల్‌ ఇచ్చింది. దీన్ని మద్రాసు హైకోర్టు కొట్టివేసింది.

Sex enhancement drugs case: దీనిపై నిందితుడు సుప్రీంకోర్టులో అప్పీలు చేయగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. స్వాధీనం చేసుకున్న మాత్రలు 'మాదకద్రవ్యాల చట్టం' (నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సస్‌ యాక్ట్‌- ఎన్‌డీపీఎస్‌) పరిధిలోకి రావని తెలిపింది. వ్యాపారం కోసమే ఈ మాత్రలు చేశారన్నదానికి ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదని పేర్కొంది. మరో నిందితుడు రెండేళ్లుగా జైలులో ఉండడం, అభియోగపత్రాల దాఖలు పూర్తవడం కారణంగా అతనికి బెయిల్‌ మంజూరు చేయడానికి అవకాశాలను పరిశీలించవచ్చని ట్రయల్‌ కోర్టుకు సూచించింది.

ఇదీ చూడండి: 'ప్రధాని ట్విటర్‌ ఖాతాకే రక్షణ లేకపోతే ఎలా?'

ఇదీ చూడండి: కరోనా కాలంలో ఎంతమంది పిల్లలు అనాథలయ్యారంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.