Several People Died in Serious Road Accident: ఇంకో ఏడు కిలో మీటర్లు వెళ్తే అందరూ హాయిగా పుట్టింటికి చేరుకుంటారు.. కన్నవారిని చూడాలనే ఉత్సుకతతో ఆ ఇల్లాలు బిడ్డలు, భర్తతో కలిసి సంతోషంగా బయల్దేరింది.. అప్పటిదాకా నలుగురూ నవ్వుతూ.. హాయిగా కబుర్లు చెప్పుకొంటూ ముందుకు సాగుతున్నారు.. అంతలోనే మృత్యువు వాహన రూపంలో వేగంగా వచ్చి వారిని కబళించింది.. ఆ నలుగురి నవ్వులు చిదిమేసింది.. అతివేగం.. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా అభంశుభం తెలియని ఓ పచ్చటి కుటుంబ ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలిసి పోయాయి.. రహదారి ప్రమాద నియంత్రణ పనుల్లో నిమగ్నమైన ఓ కార్మికుడు సైతం అతివేగానికి బలయ్యాడు.. వెరసి తిరుపతి-చెన్నై హైవేలో ధర్మాపురం వద్ద శుక్రవారం చోటుచేసుకున్న అనూహ్య విషాద ఘటన నగరి, పుత్తూరు ప్రాంతాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది.
తిరుపతి-చెన్నై హైవేలో నగరి పట్టణ శివారులో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరి మండలం మిట్టపాలెం గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు భూపాల్(28), అతడి భార్య నీలావతి(24), కుమారులు నితిన్(6), ఉమేష్(5), తమిళనాడులోని వేలూరుకు చెందిన కన్నన్(40) చనిపోయారు. కడప నుంచి చెన్నైకు వస్తున్న సిమెంట్ బల్కర్ లారీ అతివేగంగా వచ్చి రోడ్డుకు మార్జిన్ లైన్లు, ప్లాస్టిక్ రేడియం స్టిక్కర్లు వేస్తున్న కూలీల వాహనాన్ని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. నగరి నుంచి పుత్తూరులోని అత్తగారింటికి తన భార్యా పిల్లలతో వెళ్తున్న భూపాల్ వాహనాన్ని.. హైవే పనులు చేస్తున్న వాహనం ఎదురుగా వెళ్లి ఢీకొనడంతో వారు వెనుక వస్తున్న కారుపై పడి దాని బంపర్ తగిలి రోడ్డు పక్కన చెల్లాచెదురుగా పడ్డారు. వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా భూపాల్, కన్నన్, నితిన్, ఉమేష్ కన్నుమూశారు. భూపాల్ భార్య నీలావతి, రోడ్డు పనులు చేస్తున్న మణికంఠన్ (23), కన్నన్ భార్య తిరువావురసి, దినేష్(19)ను అత్యవసర చికిత్స కోసం తిరుపతిలోని రుయా సుపత్రికి తరలించగా అక్కడ నీలావతి మరణించింది. సీఐ సురేష్ కేసు నమోదు చేశారు.
Three Dead in Road Accident at Yarnagudem: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ద్విచక్రవాహనం.. ముగ్గురు మృతి
Four People Died in One Family.. నగరి మండలం మిట్టపాలెంకు చెందిన భూపాల్ భవన నిర్మాణ కార్మికుడు. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం వారిది. అతడు భార్య నీలావతి, కుమారులు నితిన్, ఉమేష్‌తో కలిసి పుత్తూరులోని అత్తగారింటికి బయల్దేరాడు. నూతన వస్త్రాలు కొనుగోలు చేసి ఆనందంగా తన వాహనంపై ముగ్గురినీ ఎక్కించుకుని గ్రామం నుంచి పుత్తూరుకు వెళ్తున్నాడు. గత వారమే నూతన నివాసంలో గృహ ప్రవేశం జరిగింది. అందరూ ఇంకా ఆ ఆనందం నుంచి బయటకు రాలేదు. తమ వాహనంపై వెళ్తుండగా ధర్మాపురం వద్ద ఊహించని రీతిన రోడ్డు పనులు చేస్తున్న వాహనం అపసవ్య దిశగా వచ్చి ఢీకొట్టడంతో నలుగురూ చెల్లాచెదురుగా పడ్డారు. అప్పటిదాకా ఉన్న నవ్వులు ఒక్కసారిగా బోసిపోయి రక్తపు మడుగుల్లో తలోదిక్కున వారు పడిపోయారు.
మరీ దారుణమేమంటే.. విజయపురం నుంచి పూత్తూరు వెళ్తున్న కారుపై ఆ నలుగురు పడి ఆపై రోడ్డు పక్కన చెల్లాచెదురుగా పడటం. ఆపై ఆస్పత్రికి తరలించగా తండ్రీ కొడుకులు ఒకసారి ఆపై నీలావతి రాత్రి సమయాన కన్నుమూశారు. దీంతో మిట్టపాలెం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. గ్రామస్థులు హుటాహుటిన నగరి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ‘వారమైనా కాలేదు.. నూతన గృహంలోకి వచ్చి.. ఆ దేవుడికి ఇలా ఎందుకు చేయాలని అనిపించింది’ అంటూ బంధువులు విలపించారు.
Road Accident: ఏపీలో వేరు వేరు చోట్ల ఘోర రోడ్డు ప్రమాదాలు.. 11మంది మృతి
Man from Tamil Nadu Died in an Accident: మరోవైపున.. రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా బోర్డర్లు వేయడం, రేడియం స్టిక్కర్లు అమర్చే పనులు చేసేందుకు తమిళనాడులోని వేలూరుకు చెందిన కన్నన్, విల్లుపురానికి చెందిన మణికంఠన్, ఆలమందూరుపేటకు చెందిన దినేష్, వేలూరుకు చెందిన తిరువావురసి, కాలైకురిచ్చికి చెందిన హరికృష్ణ వచ్చారు. రేడియం జాకెట్లు ధరించి సరదాగా కబుర్లు చెప్పుకొంటూ వీరు ధర్మాపురం సమీపాన పనుల్లో ఉండగా వెనుక నుంచి అతివేగంగా వచ్చిన సిమెంట్ లారీ.. వీరి వాహనాన్ని ఢీకొంది. తీవ్రగాయాలైన వీరిని ఆస్పత్రికి తరలించగా కన్నన్ మృతిచెందాడు. వేగ నియంత్రణకు పనులు చేస్తుంటే తిరుపతి నుంచి వస్తున్న లారీ మాత్రం వేగాన్ని అదుపు చేయలేక పోయింది. అక్కడ మార్గం జాలువారుగా ఉండటం, లారీ ఢీకొన్న ధాటికి హైవే పనుల వాహనం ఎదురుగా వస్తున్న బైకును ఢీకొనడం అన్నీ కళ్లెదుటే క్షణాల్లో జరిగాయి. లారీ ఢీకొన్న ధాటికి హవే వాహనం ఛిద్రమై కొన్ని మీటర్ల దూరం వెళ్లిపోవడం ప్రమాద తీవ్రతను సూచిస్తోంది. ఇలా చివరకు ఐదుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.