ETV Bharat / bharat

'ఆన్​లైన్​ గేమ్​లో రూ.11కోట్ల జాక్​పాట్'.. వాటా కోసం కిడ్నాప్ చేసిన ఫ్రెండ్స్.. చివరకు..

అతడో ఇంజినీరింగ్ విద్యార్థి. ఆన్​లైన్​ బెట్టింగ్​ గేమ్​లో భారీగా డబ్బు వచ్చిందని విస్తృత ప్రచారం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న అతడి స్నేహితుల్లో కొందరికి దుర్బుద్ధి పుట్టింది. అంతా కలిసి పక్కా ప్రణాళికతో అతడ్ని కిడ్నాప్ చేశారు. తండ్రికి ఫోన్​ చేసి రూ.కోటి డిమాండ్ చేశారు. చివరకు ఏమైందంటే..

online betting kidnap case
'ఆన్​లైన్​ గేమ్​లో రూ.11కోట్ల జాక్​పాట్'.. ఫ్రెండ్​ అని కూడా చూడకుండా కిడ్నాప్.. చివరకు..
author img

By

Published : Aug 11, 2022, 10:03 AM IST

ఇంజినీరింగ్ విద్యార్థి కిడ్నాప్ కేసును ఛేదించారు కర్ణాటక హుబ్లీ ధార్వాడ్ పోలీసులు. ఏడుగురిని అరెస్టు చేశారు. నిందితులంతా.. కిడ్నాప్​కు గురైన యువకుడి స్నేహితులేనని నిర్ధరించారు.
రూ.11 కోట్లు వచ్చాయని..
పోలీసుల కథనం ప్రకారం.. కిడ్నాప్​కు గురైన వ్యక్తి పేరు గరీబ్ నవాజ్ ముల్లా. హుబ్బళ్లి నివాసి. నగరంలోని ఓ ఇంజినీరింగ్​ కాలేజీలో చదువుతున్నాడు. దిల్వర్​ అనే స్నేహితుడితో కలిసి ఆన్​లైన్​ కసీనో గేమ్​ ఆడేవాడు. ఇద్దరికీ బాగా డబ్బులు వచ్చాయి. కొందరు స్నేహితులతో కలిసి ఆ సొమ్ము ఖర్చు చేసేవాడు గరీబ్ నవాజ్. ఫలితంగా.. ఆన్​లైమ్​ బెట్టింగ్ గేమ్​లో అతడికి ఏకంగా రూ.11 కోట్లు వచ్చాయని ప్రచారం జరిగింది.

online betting kidnap case
అరెస్టయిన నిందితులు

నవాజ్ స్నేహితులైన నిందితులు.. అతడి కదలికలపై నిఘా పెట్టారు. ఈనెల 6న కిడ్నాప్ చేశారు. నవాజ్ తండ్రికి ఫోన్​ చేసి.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు ఆయన నిరాకరించగా.. కనీసం రూ.15లక్షలైనా ఇవ్వాలని, లేదంటే నవాజ్​ను చంపేస్తామని బెదిరించారు.
హుబ్బళ్లిలోని బెండిగెరి పోలీస్​ స్టేషన్​లో అదే రోజున ఫిర్యాదు చేశారు నవాజ్ తండ్రి. కేసును సీరియస్​గా తీసుకున్న హుబ్లీ ధార్వాడ్ కమిషనర్ లాబూరామ్.. నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సెల్​ఫోన్​ నెట్​వర్క్ ద్వారా నిందితుల్ని ట్రాక్ చేసి మంగళవారం రాత్రి ఏడుగుర్ని అరెస్టు చేశారు. వారిని మహ్మద్ ఆరిఫ్, అబ్దుల్ కరీమ్, హుసేన్ సాబ్, ఇమ్రాన్ మదరాలీ, తౌసిఫ్​, మహ్మద్ రజాక్​గా గుర్తించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.