JEE Main Second Session Post Pone: జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు వాయిదా పడ్డాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. జులై 21న మొదలై 30వ తేదీన ముగియాల్సి ఉండగా.. జులై 25న పరీక్షలు ప్రారంభమవుతాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం వెల్లడించింది. అయితే ఈ వాయిదాకు గల కారణాన్ని మాత్రం చెప్పలేదు.
"జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలను జులై 25 నుంచి నిర్వహిస్తాం. మెత్తం 517 కేంద్రాల్లో 6.29 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. అందుకు సంబంధించిన హాల్ టికెట్లను.. గురువారం నుంచి అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి."
-- నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ
జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలను ఎన్టీఏ.. జూన్ 23 నుంచి 29 వరకు నిర్వహించింది. ఆ ఫలితాలను జులై 12న ప్రకటించింది.
ఇవీ చదవండి: సిద్ధూ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్.. ఇద్దరు మృతి
'రోజూ ఇవి ఎలా తినగలం సారూ?'.. మాడిన రొట్టెలపై కోర్టులో ఖైదీ ఫిర్యాదు