ETV Bharat / bharat

అంబానీ కుటుంబ భద్రతపై సుప్రీం కీలక ఆదేశాలు

author img

By

Published : Jul 22, 2022, 3:43 PM IST

Mukesh Ambani family security news: ముకేశ్​ అంబానీ, ఆయన కుటుంబానికి కల్పించిన భద్రతను కొనసాగించడానికి కేంద్రానికి సుప్రీం కోర్టు అనుమతిని ఇచ్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.

mukesh ambani family security news
mukesh ambani family security news

Mukesh Ambani family security news: ప్రముఖ పారిశ్రామికవేత్త, అపర కుబేరుడు ముకేశ్​ అంబానీ భద్రత విషయంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అంబానీతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు భద్రతను కొనసాగించడానికి కేంద్రానికి అనుమతిని ఇచ్చింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. అంతకుముందు వారి ​భద్రతను సవాల్​ చేస్తూ దాఖలైన పిటిషన్​పై త్రిపుర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై జూన్​ 29న సుప్రీం కోర్టు స్టే విధించింది.

ఇదీ కేసు: ముకేశ్​ అంబానీ కుటుంబానికి కల్పించిన భద్రతను సవాల్​ చేస్తూ.. బికేశ్​ సాహా అనే వ్యక్తి త్రిపుర హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. విచారణ చేపట్టిన త్రిపుర హైకోర్టు రెండుసార్లు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అంబానీ, ఆయన భార్య, పిల్లలకు పొంచి ఉన్న ముప్పు, అంచనా నివేదికపై కేంద్ర హోంశాఖ వద్ద ఉన్న ఒరిజినల్​ పత్రాలను సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. అయితే.. ఆ ఆదేశాలపై స్టే విధించిన సుప్రీంకోర్టు.. ఇప్పుడు భద్రత కొనసాగింపుపై స్పష్టత ఇచ్చింది.

ఇవీ చదవండి: అబ్బాయిల ఒడిలో అమ్మాయిలు.. కాలేజీ విద్యార్థుల వినూత్న నిరసన

అత్తమామలు డైరీ చదివారని.. యువతి ఆత్మహత్య.. అందులో ఏముందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.