ETV Bharat / bharat

'ఎన్నిసార్లు పెళ్లయింది? ప్రస్తుత భర్త ఎవరు?'.. లేడీ తహసీల్దార్​కు RTI కార్యకర్త ప్రశ్నలు

ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని సామాన్యులు సైతం సులువుగా పొందగలిగేలా చేసింది సమాచార హక్కు చట్టం. అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చేందుకు, ఎంతో మందికి న్యాయం జరిగేందుకు కారణమైంది. అలాంటి బ్రహ్మాస్త్రాన్ని సిల్లీ పనులకు ఉపయోగించి కటకటాలపాలయ్యాడు ఓ వ్యక్తి.

RTI activist nagaraj case
సహ చట్టం కింద వింత ప్రశ్నలు
author img

By

Published : Oct 3, 2022, 8:17 AM IST

  • మన మండలం మహిళా తహసీల్దార్​కు ఎన్నిసార్లు పెళ్లయింది?
  • ఆమె ఎన్నిసార్లు విడాకులు తీసుకున్నారు?
  • ప్రస్తుతం ఆమె భర్త ఎవరు?
  • ఆమెకు పెళ్లి ఎక్కడ జరిగింది? వివాహ ధ్రువపత్రం, కల్యాణ మండపం వివరాలు ఇవ్వగలరు!
  • గతంలో ఆమెను పెళ్లాడిన వారు విడిచిపెట్టడానికి కారణాలేంటి?
  • వారంతా ఏ శాఖల్లో పని చేస్తున్నారు?
  • భర్తలు అందరూ ఆమెకు విడాకులు ఇచ్చారా లేదా?

అసలేంటీ పిచ్చి ప్రశ్నలు అనుకుంటున్నారా? కర్ణాటక కోలార్ జిల్లా ములబగిలు మండలం రెవెన్యూ కార్యాలయం సిబ్బంది కూడా అలానే ఫీలయ్యారు. సమాచార హక్కు చట్టం కింద ఇలాంటి దరఖాస్తులు కూడా చేస్తారా అని నిర్ఘాంతపోయారు. కాసేపటికి తేరుకుని.. వారు చేయాల్సిన పని చేశారు.

ఈ 'ప్రశ్నలు' సంధించిన వ్యక్తి.. మండికల్ నాగరాజ్. సమాచార హక్కు చట్టం కార్యకర్తగా ములబగిలు మండలంలో ప్రాచుర్యం పొందాడు. ఏమైందో ఏమో కానీ.. ములబగిలు మండలానికి తహసీల్దార్​గా చేస్తున్న మహిళపై గురిపెట్టాడు నాగరాజ్. ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమాచారం అంతా సత్వరమే అందించాలని సహ చట్టం కింద దరఖాస్తు చేశాడు.

RTI activist nagaraj
నిందితుడు నాగరాజ్

నాగరాజ్​ దరఖాస్తును తీవ్రంగా పరిగణించారు మహిళా తహసీల్దారు. ములబగిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారు. న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. కోర్టు ఆదేశాల ప్రకారం జుడీషియల్ కస్టడీకి తరలించారు. అసలు అతడు ఈ ప్రశ్నలన్నీ ఎందుకు వేశాడా అని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తెగ చర్చించుకుంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.