ETV Bharat / bharat

Azadi Ka Amrit Mahotsav: రాచరికం వదిలి రాజ్‌పై పోరు.. - భారత స్వాతంత్ర్య ఉద్యమంలో గోపాలదాస్‌ దేశాయ్‌ పాత్ర

పేరుకు మహారాజులైనా... బ్రిటిష్‌రాజ్‌ అడుగులకు మడుగులొత్తినవారే ఎక్కువ! భయానికో భక్తికో తెల్లవారికి మద్దతు పలికి తమ దర్బార్లను, దర్పాన్ని కాపాడుకున్న సంస్థానాధీశులే అంతా! కానీ, జాతీయోద్యమం (Azadi Ka Amrit Mahotsav) కోసం తన సంస్థానాన్నీ, ఆస్తిపాస్తులను వదులుకొన్న అరుదైన రాజు దర్బార్‌ గోపాలదాస్‌ దేశాయ్‌! అంటరానితనం నిర్మూలన, మహిళలకు ఉచిత విద్య, సమానత్వం కోసం కృషిచేసిన అభ్యుదయవాది ఆయన.

Azadi Ka Amrit Mahotsav, Gopaldas Desai
గోపాలదాస్‌ దేశాయ్‌
author img

By

Published : Oct 30, 2021, 8:42 AM IST

ప్రస్తుత గుజరాత్‌ ఖేడా జిల్లాలోని వాసోలో జన్మించిన(1887) గోపాల్‌దాస్‌ సౌరాష్ట్రలోని ధాసా సంస్థానాధీశుడిగా ఉండేవారు. చాలామంది సంస్థానాధీశుల్లా హంగులూ ఆర్భాటాలకు పోకుండా సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండేవారు. ఆస్తులు కూడబెట్టుకోవటం కంటే... అందరి సంక్షేమం కోసం ఆలోచించేవారు. తన కుటుంబంలాగే సామాన్య ప్రజలకు కూడా సౌకర్యాలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో... అందరికీ ఉచిత విద్య అందించాలని తపించారు. 1915లోనే మాంటెస్సోరి పాఠశాల ఆరంభించారు. మహిళలకు విద్యనందించేందుకు ప్రత్యేకంగా విఠల్‌ కన్యా విద్యాలయ, వల్లభ్‌ కన్యా విద్యాలయ పేరుతో రెండు గురుకులాలు ఆరంభించారు. అంతేగాకుండా గాంధీజీ స్ఫూర్తితో తమ ప్రాంతంలో అంటరానితనం నిర్మూలనకు కృషి చేసేవారు. తన భార్య గర్భిణిగా ఉన్నప్పుడే.. 'ఒకవేళ ఆడపిల్ల పుడితే తప్పకుండా దళితబాలుడిని అల్లుడిగా తెచ్చుకుంటా' అని ప్రకటించారు. మహాత్మాగాంధీని అభిమానించే ఆయన బహిరంగంగానే జాతీయోద్యమానికి, కాంగ్రెస్‌ పార్టీకి అండగా నిలిచారు. ఆర్థికంగా సాయం చేసేవారు. 1921లో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరి క్రియాశీలకంగా మారారు. ఖేడా జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడయ్యారు. దీంతో... బ్రిటిష్‌ ప్రభుత్వం ఆయనపై కక్ష కట్టింది. కాంగ్రెస్‌తో, జాతీయోద్యమంతో సంబంధాలు తెంచుకోకుంటే సంస్థానాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించింది. గోపాల్‌దాస్‌ బెదరలేదు. తెల్లవారి హెచ్చరికలను బేఖాతరు చేశారు. ఫలితంగా 1922లో ఆయన సంస్థానాన్ని ఆంగ్లేయులు తీసేసుకున్నారు. ఆపై భార్య భక్తిబాతో కలిసి పూర్తిస్థాయిలో ఉద్యమంలోకి దూకారు. బ్రిటిష్‌ ప్రభుత్వం ఈ కుటుంబంలో చిచ్చుపెట్టాలని చూసింది. గోపాలదాస్‌ కుమారుడు సూర్యకాంత్‌ను కొత్త రాజుగా ప్రకటించింది. కానీ ఆయన కూడా తండ్రి తరహాలోనే కాంగ్రెస్‌కే తన మద్దతంటూ రాచరికాన్ని తిరస్కరించారు. మిగిలిన ముగ్గురు కుమారులనూ బ్రిటిష్‌ సర్కారు దువ్వే ప్రయత్నం చేసింది. అంతా తండ్రి బాటలోనే పయనిస్తాం తప్ప... సంస్థానం వద్దని తేల్చిచెప్పేశారు. అలా తమ సంస్థానాన్ని వద్దనుకొని స్వాతంత్రోద్యమంలోకి దూకింది గోపాల్‌దాస్‌ కుటుంబం!

సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో ఆయన కుటుంబ సభ్యులందరినీ జైల్లో పెట్టింది బ్రిటిష్‌ ప్రభుత్వం. ఆ సమయానికి ఆరు నెలల వయసున్న చిన్న కుమారుడు బరీంద్రనూ ఖైదులో ఉంచారు. స్వాతంత్య్రానంతరం సంస్థానాన్ని గోపాల్‌దాస్‌కు తిరిగిచ్చింది భారత ప్రభుత్వం. వెంటనే ఆయన దాన్ని భారతావనిలో కలిపేశారు. భారత్‌లో బేషరతుగా విలీనానికి సంతకం చేసిన తొలి సంస్థానాధీశుడు గోపాల్‌దాసే! 1951లో మరణించిన ఆయన ఆలోచనల్లో కాలంకంటే ముందున్నారు. ఎలాంటి హక్కుల ఉద్యమాలూ లేని దాదాపు వందేళ్ల కిందటే అభ్యుదయవాద ఆలోచనలు, ఆచరణతో ఆదర్శంగా నిలిచారు.

ఇదీ చూడండి: ఎంపీలకు ఉచిత విమాన టికెట్లు బంద్‌!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.