ETV Bharat / bharat

కూచిపూడి నృత్యంతో అదరగొట్టిన సునాక్‌ కుమార్తె.. భారత్​కు వెళ్లడమే ఇష్టమంటూ.. - బ్రిటన్ నూతన ప్రధాని

Rishi Sunak Daughter : బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ తొమ్మిదేళ్ల కుమార్తె అనౌష్క కూచిపూడి నృత్యంతో ఆకట్టుకుంది. లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె నృత్య ప్రదర్శన ఇచ్చింది.

rishi sunak daughter
రిషి సునాక్ కుమార్తె
author img

By

Published : Nov 27, 2022, 6:38 AM IST

Updated : Nov 27, 2022, 7:03 AM IST

Rishi Sunak Daughter : భారతీయ మూలాలు ఉన్న బ్రిటన్‌ నూతన ప్రధాని రిషి సునాక్‌కు మన దేశ సంస్కృతి, సంప్రదాయాలంటే అపారమైన అభిమానం. వీలు చిక్కినప్పుడల్లా దేవాలయాలను సందర్శించుకోవడం సహా భారతీయ పండగలను రిషి కుటుంబం ఘనంగా చేసుకుంటుంది. తండ్రి బాటలోనే రిషి కుమార్తె కూడా భారతీయ కళల పట్ల మక్కువ చూపుతోంది. ఆయన తొమ్మిదేళ్ల కుమార్తె అనౌష్క సునాక్.. మన సంప్రదాయ నృత్యాల్లో ఒకటైన కూచిపూడిలో శిక్షణ తీసుకుంటోంది. నేర్చుకోవడం మాత్రమే కాదు.. తాజాగా లండన్‌లో జరిగిన ఓ సాంస్కృతిక కార్యక్రమంలో అనౌష్క నృత్య ప్రదర్శన ఇచ్చి ఆకట్టుకుంది.

లండన్‌లో 'రాంగ్‌-2022' పేరుతో ఇంటర్నేషనల్‌ కూచిపూడి డ్యాన్స్‌ ఫెస్టివల్‌ నిర్వహించారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన 4-85ఏళ్ల కళాకారులు ఈ కార్యక్రమంలో ప్రదర్శనలు ఇచ్చారు. ఇందులో పాల్గొన్న రిషి కుమార్తె అనౌష్క సునాక్‌ మరికొందరు చిన్నారులతో కలిసి ఇచ్చిన కూచిపూడి నృత్యప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి రిషి సతీమణి అక్షతా మూర్తి, ప్రధాని తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులు హాజరయ్యారు. తనకు డ్యాన్స్‌ అంటే చాలా ఇష్టమని అనౌష్క ఓ మీడియా ఛానల్​కు తెలిపింది. ఇక భారత్‌ గురించి ప్రస్తావిస్తూ.. "కుటుంబం, ఇల్లు, సంస్కృతి సంప్రదాయాలు మిళితమైన దేశం భారత్‌. అక్కడకు వెళ్లడం నాకు చాలా ఇష్టం" అని ఉత్సాహంగా చెప్పింది.

ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షతామూర్తిని రిషి సునాక్‌ ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. 2009లో బెంగళూరులో వీరి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు కృష్ణ సునాక్‌, అనౌష్క సునాక్‌. సంప్రదాయాలకు ఎక్కువగా విలువిచ్చే రిషి దంపతులు తమ పిల్లలకు కూడా వాటిని చిన్నప్పటి నుంచే నేర్పుతున్నారు.

Last Updated : Nov 27, 2022, 7:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.