ETV Bharat / bharat

'స్కూల్​కు ఎందుకు రాలేదు'.. రిటైర్డ్​ టీచర్​కు షోకాజ్​ నోటీసులు - పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె

రిటైర్​ అయిన ఓ ఉపాధ్యాయునికి ప్రభుత్వం షోకాజ్​ నోటీసులు జారీ చేసింది. ఉద్యోగానికి ఎందుకు రాలేదని ప్రశ్నించింది. బంగాల్​లో ఈ ఘటన జరిగింది.

retired-teacher-show-caused-given-by-west-bengal-government
రిటైర్డ్​ ఉపాధ్యాయునికి ప్రభుత్వం షోకాజ్​ నోటీసులు
author img

By

Published : Mar 25, 2023, 9:15 PM IST

Updated : Mar 25, 2023, 9:56 PM IST

ఉద్యోగానికి ఎందుకు రాలేదని.. పదవీ విరమణ చేసిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయునికి బంగాల్​ రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్​ నోటీసులు జారీ చేసింది. 2023 మార్చి 10న విధులకు ఎందుకు హాజరు కాలేదో వివరణ ఇవ్వాలని సూచించింది. పాఠశాల విద్యా శాఖ పేరిట ఈ నోటీసు జారీ అయింది. చటోపాధ్యాయ అనే రిటైర్డ్​ టీచర్​కు.. ప్రభుత్వం పేరిట ఈ నోటీసులు అందాయి. ఈయన ఓ ఫిజికల్​ ఎడ్యుకేషన్​ టీచర్. 36 సంవత్సరాలు పాటు అదే వృత్తిలో పనిచేశారు. చివరగా హూగ్లీలోని ఆది సాప్​త్యాగ్రామ్ హై స్కూల్ పనిచేసి.. పదవీ విరమణ చేశారు. కేవలం చటోపాధ్యాయకు మాత్రమే కాకుండా.. మరికొంత మందికి సైతం ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.

ఈ నోటీసులపై చటోపాధ్యాయ స్పందించారు. సెకండరీ ఎడ్యుకేషన్‌ బోర్డు తీరుపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. డీఏ పెంచాలనే డిమాండ్​తో సమ్మె చేసిన ఉద్యోగుల జాబితాలో తన పేరు ఉండొచ్చని చటోపాధ్యాయ అభిప్రాయపడ్డారు. "పదవి విరమణ చేసిన మరికొంత ఉపాధ్యాయులకు, చనిపోయిన వారికి కూడా ఈ తరహా నోటీసులే అందినట్లు తెలిసింది. నేను ఉద్యోగుల సమ్మెకు మద్ధతు ఇస్తాను. కానీ రిటైర్డ్​ అయ్యాక నోటీసులు రావడమనదే హాస్యాస్పదంగా ఉంది." అని చటోపాధ్యాయ అన్నారు.

బంగాల్ రాష్ట్ర సెకండరీ ఎడ్యుకేషన్‌ బోర్డు.. 300 పాఠశాల్లో పనిచేసే టీచర్లకు ఈ నోటీసులు జారీ చేసింది. మార్చి 10న.. డీఏ పెంచాలని కోరుతూ సమ్మె చేసిన వారందిరికీ షోకాజ్​ నోటీసులు పంపింది. అంతకుముందు ప్రభుత్వ ఉద్యోగులకు అన్ని రకాల సెలవులను రద్దు చేస్తూ.. ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.

కాగా బంగాల్​ ప్రభుత్వం ఉద్యోగులకు, పదవీ విరమణ చేసిన వారికి 3 శాతం అదనపు డీఏను చెల్లించేందుకు అంగీకరించింది. అంతకు ముందు మూలవేతనంలో 3 శాతాన్ని డియర్‌నెస్ అలవెన్స్‌గా ఇచ్చేది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే డీఏ ఆరు శాతానికి చేరింది. కాగా ప్రభుత్వ అధికారుల తీరుపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ విధుల్లో అంత అలసత్వం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం వార్నింగ్​..
ఇదే తరహాలో కేంద్ర ప్రభుత్వం కూడా ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేసింది. పాత పెన్షన్​ విధానాన్ని(ఓపీఎస్​) పునరుద్ధరించాలంటూ జరగుతున్న నిరసనల్లో పాల్గొనకూడదని ప్రభుత్వ ఉద్యోగులకు సూచించింది. ఈ సూచనను అతిక్రమిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది. దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు చేపట్టాలని జాయింట్​ ఫోరమ్​ ఫర్ రీస్టోరేషన్ ఆఫ్​ ఓల్డ్​ పెన్షన్​ స్కీమ్​ ఆధ్వర్యంలోని నేషనల్​ జాయింట్​ కౌన్సిల్​​ పిలుపునిచ్చిన తరుణంలో.. ఆ ర్యాలీల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పాల్గొనకూడదని చెప్పింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులకు సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ ​(డీఓపీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

Last Updated : Mar 25, 2023, 9:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.