ETV Bharat / bharat

పనిమనిషిని దారుణంగా కొట్టి చిత్రహింసలు.. భాజపా నాయకురాలు అరెస్ట్​ - సీమా పాత్ర భాజపా నేత

Seema Patra BJP : తన ఇంట్లో పనిచేసే మహిళను అతి దారుణంగా కొట్టి, చిత్రహింసలకు గురిచేసిన ఘటనలో ఝార్ఖండ్‌కు చెందిన భాజపా నాయకురాలు సీమా పాత్రాను రాంచీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పనిమనిషి శరీరం, ముఖంపై తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న వీడియో ఒకటి ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

sema patra
sema patra
author img

By

Published : Aug 31, 2022, 11:51 AM IST

Seema Patra BJP : తన ఇంట్లో పనిచేసే మహిళను అతి దారుణంగా కొట్టి, చిత్రహింసలకు గురిచేసిన ఘటనలో ఝార్ఖండ్‌కు చెందిన భాజపా నాయకురాలు సీమా పాత్రాను రాంచీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సీమా ఇంట్లో పనిచేసే సునీత శరీరం, ముఖంపై తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న వీడియో ఒకటి ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.సీమా పాత్రా తనను బంధించి తీవ్రంగా హింసించారని సునీత ఆ వీడియోలో వాపోయింది. కొన్ని సార్లు ఇనుప రాడ్లతో కొట్టేవారని, అలా ఓసారి తన పన్ను కూడా విరిగిపోయిందని తెలిపింది.

29 ఏళ్ల సునీత కొన్నేళ్ల క్రితం రాంచీలోని అశోక్‌నగర్‌ ప్రాంతంలో గల సీమా పాత్ర నివాసంలో పనికి చేరింది. సునీతను సీమా చిత్ర హింసలకు గురిచేస్తున్నట్లు స్థానికులు కొందరు సమాచారమివ్వడంతో గతవారం పోలీసులు ఆమెను రక్షించారు. తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత నుంచి సీమా పాత్ర పరారీలో ఉన్నారు. దీంతో పోలీసులు గాలింపు చేపట్టారు. రోడ్డు మార్గంలో రాంచీ నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఈ తెల్లవారుజామున పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

బుధవారం.. ఆమెను కోర్టులో హాజరుపర్చి జైలుకు తరలించనున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఘటనపై జాతీయ మహిళా కమిషన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీమా పాత్రాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఝార్ఖండ్‌ డీజీపీకి లేఖ రాసింది. సీమా పాత్రా భాజపా మహిళా విభాగం జాతీయ వర్కింగ్‌ కమిటీలో సభ్యురాలిగా ఉన్నారు. ఆమె భర్త మహేశ్వర్‌ పాత్రా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి. పనిమనిషి వీడియో వైరల్‌గా మారిన తర్వాత సీమాను మంగళవారం భాజపా సస్పెండ్‌ చేసింది.

ఇదీ చదవండి: భోజనం పెట్టలేదని.. కూతుర్ని తలపై కొట్టి చంపిన తల్లిదండ్రులు!

'భర్త పనిచేసే ఆఫీసుకెళ్లి మరీ భార్య వేధించడం క్రూరత్వమే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.