ETV Bharat / bharat

Covovax in India: 2 నుంచి 17 ఏళ్ల పిల్లలపై క్లినికల్‌ ట్రయల్స్‌..! - కొవావాక్స్‌ టీకా ట్రయల్స్​

అమెరికాకు చెందిన నొవావాక్స్‌ సంస్థ చిన్నారుల కోసం తయారు చేసిన టీకా (Covovax)ను భారత్‌లో రెండు, మూడో దశల ప్రయోగాలను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం 2 నుంచి 17ఏళ్ల మధ్య వయసు చిన్నారులను నియమించుకునే ప్రక్రియను ఆదివారం ప్రారంభించింది. దిల్లీలోని హమ్‌దార్ద్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ సైన్స్‌ అండ్‌ రీసెర్చ్‌లో వీటిని నిర్వహిస్తున్నారు.

Covovax in India
కొవొవాక్స్ టీకా
author img

By

Published : Aug 30, 2021, 5:07 AM IST

దేశంలో చిన్నారుల కోసం కరోనా టీకా తెచ్చేందుకు మరో సంస్థ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అమెరికాకు చెందిన నొవావాక్స్‌ సంస్థ చిన్నారుల కోసం తయారు చేసిన టీకా (Covovax)ను భారత్‌లో రెండు, మూడో దశల ప్రయోగాలను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం 2 నుంచి 17ఏళ్ల మధ్య వయసు చిన్నారులను నియమించుకునే ప్రక్రియను ఆదివారం ప్రారంభించింది. దిల్లీలోని హమ్‌దార్ద్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ సైన్స్‌ అండ్‌ రీసెర్చ్‌లో వీటిని నిర్వహిస్తున్నారు.

920మంది పిల్లలపై

చిన్నారులపై ప్రయోగాల్లో భాగంగా మొత్తం 920మంది పిల్లలపై వీటిని ప్రయోగించనున్నారు. ఇందులో 460 మంది 2 నుంచి 11 ఏళ్ల వయసు పిల్లలు కాగా మరో 460 మందిని 12 నుంచి 17 ఏళ్ల వయసున్న చిన్నారులను పరిగణలోకి తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. కొవావాక్స్‌ ప్రయోగాలను భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహిస్తోంది. ఇక 12 నుంచి 18 ఏళ్ల పిల్లలు వినియోగించేలా భారత్‌కు చెందిన జైడస్‌ క్యాడిలా వ్యాక్సిన్‌కు కేంద్ర ప్రభుత్వం ఈమధ్యే అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుంది.

ఇక అమెరికాకు చెందిన నొవావాక్స్‌ రూపొందించిన కొవావాక్స్‌ టీకా పెద్దల్లో సమర్థంగా పనిచేస్తున్నట్లు తేలింది. వీటిని ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, యూకే, అమెరికా దేశాల్లో 50వేల మంది పెద్దలు, 2,248 మంది చిన్నారులపై ప్రయోగాలు నిర్వహించారు. కరోనా వైరస్‌ను నిరోధించడంలో ఈ వ్యాక్సిన్‌ 90శాతం సమర్థత చూపించినట్లు ఫలితాల్లో తేలింది. భారత్‌లోనూ 1400 మంది (18 ఏళ్ల పైబడిన వారి)పై అధ్యయనం జరుగుతోంది.

ఇప్పటికే వీరందరికీ తొలి డోసు అందించగా ఎలాంటి దుష్ర్పభావాలు కనిపించలేదని తెలిసింది.ఇదే సమయంలో కొవొవాక్స్‌ టీకా మొదటి బ్యాచ్‌ ఉత్పత్తిని సీరం ఇన్‌స్టిట్యూట్‌ పుణె కేంద్రంలో ఈ మధ్యే ప్రారంభించారు.

ఇదీ చదవండి: కేరళలో కాస్త తగ్గిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.