ETV Bharat / bharat

సొంత చెల్లెళ్లపైనే అత్యాచారం.. కన్నతల్లిని కూడా.. - ఒడిశా భువనేశ్వర్​ వార్తలు

Rape Victim News: సొంత చెల్లెళ్లపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. అడ్డువచ్చిన తల్లిని కూడా రేప్ చేసేందుకు యత్నించాడు. ఈ దారుణ ఘటన ఝార్ఖండ్​లోని లోహర్​దగా జిల్లాలో జరిగింది. కర్ణాటక, మహారాష్ట్రలో కూడా అత్యాచార ఘటనలు వెలుగు చూశాయి. కర్ణాటకలోని ఓ యువతి సామూహిక అత్యాచారానికి గురవగా.. ముంబయిలో ఏడేళ్ల బాలికపై దారుణానికి ఒడిగట్టాడు ఓ వ్యక్తి.

అత్యాచారం
అత్యాచారం
author img

By

Published : Apr 28, 2022, 5:52 PM IST

Updated : Apr 28, 2022, 6:53 PM IST

Brother Raped Sisters: ఝార్ఖండ్​లోని లోహర్​దగా జిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. చెల్లెళ్లకు రక్షణగా ఉండాల్సిన సోదరుడే వారిపై గత మూడేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు.. అడ్డువచ్చిన తల్లిపై కూడా అఘాయిత్యం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేశారు.

పోలీసుల వివరాలు ప్రకారం.. గత మూడేళ్లుగా మైనర్లు అయిన తన ఇద్దరి చెల్లెళ్లపై నిందితుడు అత్యాచారానికి పాల్పడేవాడు. ఇటీవల మరోసారి అత్యాచారానికి ప్రయత్నించగా ప్రతిఘటించిన బాధితురాళ్లు తల్లికి ఈ విషయాన్ని చెప్పారు. ఈ క్రమంలో తల్లిపై కూడా అత్యాచారానికి ప్రయత్నించాడు ఆ కామాంధుడు. ఈ విషయంపై స్థానిక పోలీసులకు తల్లి ఫిర్యాదు చేయడం వల్ల పోక్సో చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్​ చేశారు.

Rape Victim News: కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో ఆటోలో ప్రయాణిస్తున్న యువతిపై డ్రైవర్​, అతని స్నేహితుడు అత్యాచారానికి పాల్పడ్డారు. మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్​ చేశారు. వారిని అదే ప్రాంతానికి చెందిన హనుమంత్​, నర్సప్పగా గుర్తించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. యాదగిరి పట్టణం​ నుంచి ఆటోలో ఇంటికి వెళ్తున్న యువతిని.. ఆ ఆటో డ్రైవర్​ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆ సమయంలో అతని స్నేహితుడు కూడా ఉన్నాడు. తనను వదిలేయమని యువతి ప్రాధేయపడినా వినకుండా ఆమెపై నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇదంతా వీడియో తీశారు. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామంటూ బెదిరించారు. బాధితురాలు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా.. వారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులను అరెస్ట్​ చేశారు. వారి ఆటోను స్వాధీనం చేసుకున్నారు.

టెంపో డ్రైవర్​ అత్యాచారం..: మంగళవారం మహారాష్ట్ర ముంబయిలో మరో అత్యాచార ఘటన జరిగింది. చాక్లెట్​ ఇప్పిస్తానని ఆశచూపి ఓ ఏడేళ్ల బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లిన టెంపో డ్రైవర్​ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను అక్కడ వదిలేసి పరారయ్యాడు. బాలిక ఏడుస్తుండటం గమనించిన ఓ స్థానికుడు పోలీసులకు సమాచారం అందించాడు. బాలిక చెప్పిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఆధారంగా నిందితుడు సచిన్​ షమాను అరెస్ట్​ చేశారు.

రాజస్థాన్​లో..: మరిది కళ్ల ముందే వదిన సామూహిక అత్యాచారానికి గురైన ఘటన రాజస్థాన్​లోని భరత్​పుర్​ జిల్లాలో వెలుగుచూసింది. పుట్టింటి నుంచి వదినను ఇంటికి తీసుకువస్తున్న మరిదిని ఘట్మిక అడవి ప్రాంతంలో ఆరుగురు దుండగులు అడ్డగించారు. మరిదిపై తుపాకీ ఎక్కుపెట్టి బెదిరింపులకు పాల్పడ్డ దుండగులు.. అతని వెంట వచ్చిన వదినపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ దారుణం మంగళవారం రాత్రి సుమారు తొమ్మిది గంటలకు జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

మరోవైపు.. ఒడిశా భువనేశ్వర్​లోని లస్మీసాగర్​లో ఓ విషాద ఘటన జరిగింది. చింతమనీశ్వర్​ ప్రాంతంలో నివాసం ఉంటున్న మహారాష్ట్రకు చెందిన దంపతులు తమ 15 నెలల చిన్నారితో పాటు ఆత్మహత్య చేసుకున్నారు. తొలుత చిన్నారిని చంపిన ఆ తర్వాత వారిద్దరూ కూడా ఊరి వేసుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకునేసరికి ఇంట్లో ముగ్గురి మృతదేహాలు వేలాడుతూ కనిపించాయని తెలిపారు.

d
చిన్నారితో సహా ఆత్మహత్యకు పాల్పడిన దంపతులు

మృతులను.. తుషార్​ రాజేంద్ర జగతబ్​, నీలా తుషార్​ జగతబ్​, సిబినయాగా గుర్తించారు పోలీసులు. స్థానికుల వివరాల ప్రకారం.. మొదటి భార్య మృతిచెందిన నేపథ్యంలో నీలా తండ్రి ఇటీవల రెండో వివాహం చేసుకుని ఆస్తిని అంతా ఆమెకు రాసిచ్చాడని.. దీనిపై భార్యభర్తల మధ్య గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు. ఇదే ఈ దుర్ఘటనకు కారణమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ప్రేమించమని చేసిన ప్రపోజ్​లను తిరస్కరించినందుకు యువతిపై యాసిడ్​ దాడికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో గురువారం జరిగింది. తీవ్రంగా గాయపడిన యువతిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడు నగేశ్​ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇదీ చూడండి : 'రాష్ట్రపతిని కాను.. అయితే ప్రధాని.. లేదంటే యూపీ సీఎం!'

Last Updated : Apr 28, 2022, 6:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.