ETV Bharat / bharat

నేటి నుంచే రంజాన్ మాసం.. మోదీ శుభాకాంక్షలు

author img

By

Published : Apr 3, 2022, 7:38 AM IST

Ramadan 2022: ముస్లింల పవిత్ర మాసం రంజాన్​ను పురస్కరించుకుని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర మాసం పేదలకు సేవ చేసేలా ప్రజల్లో స్ఫూర్తిని కలిగించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సమాజంలో శాంతి, సామరస్యం, కరుణ పెంపొందాలని ఆకాంక్షించారు.

modi
మోదీ

Ramadan 2022: ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ మాసం నేడు ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముస్లింలకు ప్రధాని నరేంద్ర మోదీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర మాసం పేదలకు సేవ చేసేలా ప్రజల్లో స్ఫూర్తిని కలిగించాలని కోరుకున్నారు. సమాజంలో శాంతి, సామరస్యం, కరుణ పెంపొందాలని ఆకాంక్షించారు. దేశంలో ఆదివారం నుంచి రంజాన్​ నెల ప్రారంభమైంది. ముస్లింలంతా ఉపవాస దీక్షలు ప్రారంభించారు. శనివారం సాయంత్రం చంద్రుడు కనిపించాడని, ఆదివారం నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభమవుతాయని ఫతేపుర్ మసీదు ఇమామ్ ముప్తీ ముఖర్రం అహ్మద్​ తెలిపారు.

ఉత్తరప్రదేశ్, తమిళనాడు, బంగాల్ వంటి రాష్ట్రాల్లోని వివిధ ఇస్లాం సంస్థలు కూడా రంజాన్ మాసం ఆదివారం ప్రారంభమవుతుందని ప్రకటించాయి. దీంతో మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రంజాన్ మాసంలో ముస్లిం భక్తిశ్రద్దలతో నెలరోజులపాటు కఠోర దీక్షతో ఉపవాసాలు ఉంటారు. తెల్లవారుజామున 4 గంటల 46 నిమిషాలకు సహర్​తో ప్రారంభమై.. సాయంత్రం 6 గంటల 34 నిమిషాలకు ఇఫ్తార్‌తో ఉపవాస దీక్ష ముగుస్తుంది. మళ్లీ ఇదే విధంగా.. సమయంలో కొద్దిపాటి మార్పులతో నెలరోజులపాటు దీక్షను పాటిస్తారు.

ఇదీ చదవండి: చెత్త, పాత బట్టలే ఈ అమ్మవారికి కానుకల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.