ETV Bharat / bharat

51 అంగుళాల విగ్రహం, 392 స్తంభాలు, లక్షల అడుగుల పాలరాయి- అంకెల్లో 'అయోధ్య అద్భుతాలు' ఇవిగో! - రామ మందిరం ప్రాణప్రతిష్ఠ

Ram Mandir Pran Pratishtha : అయోధ్యలో రామ మందిర పరిసరాలు పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉండనున్నాయి. ఆలయ కాంప్లెక్స్‌ ఆత్మనిర్భర్‌గా ఉండేలా ట్రస్ట్‌ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ సమీపిస్తున్న తరుణంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆలయ విశేషాలను తెలుసుకుందాం.

Ram Mandir Pran Pratishtha
Ram Mandir Pran Pratishtha
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 27, 2023, 6:30 PM IST

Ram Mandir Pran Pratishtha : ప్రతిష్ఠాత్మక అయోధ్య రామమందిరం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వచ్చే నెల 22న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నేపథ్యంలో బాలుడి రూపంలో ఉన్న రాముడిని ప్రతిష్ఠిచేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెల్లటి మకర్న పాలరాయితో నిర్మించిన గర్భగుడిలో 51 అంగుళాల పొడవైన రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు ట్రస్ట్​ తెలిపింది. ఐదేళ్ల వయసున్న రాముడి కోసం ప్రస్తుతం మూడు డిజైన్లను రూపొందించామని, అందులో ఒకదానిని ఎంపిక చేస్తామని ట్రస్ట్​ కార్యదర్శి చంపత్​ రాయ్​ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే అయోధ్య రామమందిరానికి సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం

Ram Mandir Pran Pratishtha
రాముడి గర్భగుడి
  • సుమారు 22 లక్షల ఘనపు అడుగుల​ రాయితో ఆలయ నిర్మాణం
  • ఇంజినీర్లు కృత్రిమంగా రూపొందించిన 56 పొరల రాయితో పునాది
  • 17000 గ్రానైట్​ బ్లాక్స్​, ఐదు లక్షల ఘనపు అడుగుల గులాబీ రాయి వాడకం
  • తెలంగాణ, కర్ణాటక నుంచి గ్రానైట్​, రాజస్థాన్​ నుంచి గులాబీ రాయి సేకరణ
  • ఆలయ నిర్మాణంలో 392 పిల్లర్లు, 44 తలుపులు
  • జీ ప్లస్​ 2 పద్ధతిలో ఆలయ నిర్మాణం- ప్రతి అంతస్తు​ ఎత్తు 20 అడుగులు
  • ఆలయ అవసరాల కోసం ప్రత్యేక నీటి శుద్ధీకరణ ప్లాంటులు
  • సొంత డ్రైనేజీ, విద్యుత్‌ వ్యవస్థ, నీళ్ల కోసం అండర్‌ గ్రౌండ్‌ రిజర్వాయర్
  • ఆలయ కాంప్లెక్స్‌లో రెండు మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్‌లు, ఒక వాటర్ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌
  • 20 ఎకరాల్లో ఆలయ నిర్మాణం, 50 ఎకరాల్లో పచ్చదనం పెంపు
  • సంప్రదాయ నాగర శైలిలో ఆలయ సముదాయం నిర్మాణం
  • తూర్పు-పడమర దిశలో 380 అడుగుల పొడవు- 250 అడుగుల వెడల్పు- 161 అడుగుల ఎత్తుతో నిర్మాణం
  • వృద్ధులు, దివ్యాంగుల సౌకర్యార్థం ప్రత్యేకంగా ర్యాంపులు
  • 25వేల మంది భక్తులు సెల్‌ఫోన్లు, పాదరక్షలు, చేతి గడియారాలు భద్రపరుచుకునేందుకు వీలుగా పెద్ద సముదాయం ఏర్పాటు
  • ఆలయంలో హెల్త్​ కేర్​ సెంటర్​తో పాటు టాయిలెట్ బ్లాక్​
  • అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు భక్తులు త్వరగా బయటకు వెళ్లేందుకు ప్రత్యేక దారి
  • #WATCH | Secretary of Shri Ram Janmabhoomi Teerth Kshetra, Champat Rai describes the map of Shri Ram Janmabhoomi temple.

    He says "This is the map of the land which has been allotted to the Trust on the directions of the Supreme Court...." pic.twitter.com/RR1l1yBNkd

    — ANI (@ANI) December 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అయోధ్యలోని రామ మందిర పరిసరాలు ఎక్కువ భాగం పచ్చదనంతో నిండి ఉంటాయని ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్ తెలిపారు. 70 ఎకరాల్లో 70 శాతం చెట్లు, మొక్కలతోనే విస్తరించి ఉంటుందని పేర్కొన్నారు. ఇందుకోసం 600 చెట్లను గ్రీన్‌ బెల్ట్‌లో సంరక్షిస్తున్నామని చెప్పారు. పచ్చదనంలో ఎక్కువ భాగం చెట్లే ఉంటాయని సూర్యరశ్మి కూడా ఫిల్టర్‌ అయ్యేలా ఉంటుందన్నారు.

  • #WATCH | General Secretary of Shri Ram Janmabhoomi Teerth Kshetra, Champat Rai describes the map of Shri Ram Janmabhoomi temple.

    He says "If needed, we will take water from the Saryu river or from the ground. But ground water will go into the ground only. Construction is… pic.twitter.com/rz1u35Q47z

సర్వాంగ సుందరంగా రామ్​పథ్​
అయోధ్య రామాలయానికి వెళ్లే రామ్​పథ్​ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు అధికారులు. ఇరువైపులా ఉన్న దుకాణాల షట్టర్లపై జై శ్రీరామ్​ నినాదంతో పాటు స్వస్తిక్​ గుర్తులను ముద్రిస్తున్నారు. సహదత్​గంజ్​ నుంచి నయా ఘాట్​ను కలిపే ఈ 13 కిలోమీటర్ల పొడవైన రోడ్డును హిందూ మతానికి చెందిన గుర్తులతో అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ రోడ్డుపై జైశ్రీరామ్​ జెండాలతో పాటు రాముడి, రామ్​ దర్బార్ లాంటి ఇతర​ చిత్రపటాలను విక్రయిస్తున్నారు.

Ram Mandir Pran Pratishtha
ధర్మపథ్​లో ప్రతిష్ఠిస్తున్న సూర్య స్తంభాలు

ధర్మపథ్​లో సూర్య స్తంభాలు ఏర్పాటు
అయోధ్యకు వెళ్లే మరో మార్గంలో సూర్య స్తంభాలను ప్రతిష్ఠిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా 30 అడుగుల పొడవైన సూర్య స్తంభాలను పెడుతున్నారు. అయోధ్య బైపాస్​ను కలిపే ధర్మపథ్​లో సుమారు 40 పిల్లర్లను వినియోగిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 10 పిల్లర్లను నిర్మించగా, మిగిలిన పనులను డిసెంబర్​ 29 వరకు పూర్తి చేస్తామని వివరించారు. డిసెంబర్​ 30న జరిగే అయోధ్య రైల్వే స్టేషన్​, విమానాశ్రయ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు ప్రధాని మోదీ హాజరవుతారని అధికారులు చెప్పారు. అనంతరం ఎయిర్​పోర్ట్​ నుంచి అయోధ్య వరకు నిర్వహించే ర్యాలీలో ఆయన మాట్లాడతారని తెలిపారు. ప్రధాని మోదీకి ఈ సూర్య స్తంభాలు స్వాగతం పలుకుతాయని వివరించారు.

Ram Mandir Pran Pratishtha
అయోధ్య రామాలయం నిర్మాణ పనులు
Ram Mandir Pran Pratishtha
అయోధ్య రామాలయం నిర్మాణ పనులు

ఆలయ కాంప్లెక్స్‌లో మరో ఏడు గుడులు
అయోధ్య ఆలయం దీర్ఘచతురస్ర ఆకారంలో చుట్టుకొలత కలిగి ఉంటుంది. ఇలాంటి ఆలయాలు ఎక్కువగా దక్షిణ భారత దేశంలో దర్శనమిస్తాయి. దీర్ఘచతురస్ర ఆకారంలో ఒక్కో మూలను సూర్యుడు, మా భగవతి, గణేష్‌, శివునికి అంకితమిస్తారు. ఉత్తరాన అన్నపూర్ణ ఆలయం, దక్షిణాన హనుమంతుడి ఆలయం ఉంటాయి. ఆలయ కాంప్లెక్స్‌లో మరో ఏడు గుడులు ఉంటాయి. మొదటి దశ ఆలయ నిర్మాణం తుది దశకు చేరుకోగా, జనవరి 22వ తేదీన రామ్‌ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది.

Ram Mandir Pran Pratishtha
అయోధ్య రామాలయం నిర్మాణ పనులు
Ram Mandir Pran Pratishtha
అయోధ్య రామాలయం నిర్మాణ పనులు
Ram Mandir Pran Pratishtha
అయోధ్య రామాలయం నిర్మాణ పనులు

'అయోధ్య ప్రాణప్రతిష్ఠకు 84 సెకన్ల అద్భుత ముహూర్తం- ఆ గడియల్లో పూర్తిచేస్తే తిరుగుండదు'

అయోధ్య రామ మందిరం ఓపెనింగ్​కు 1000 ప్రత్యేక​ రైళ్లు- ఎప్పట్నుంచంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.