ETV Bharat / bharat

మూడో వారంలో మరింత తగ్గిన రాజ్యసభ ఉత్పాదకత - పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రాజ్యసభ

Rajya Sabha productivity: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా.. మూడో వారం రాజ్యసభ ఉత్పాదకత భారీగా తగ్గింది. మూడో వారంలో షెడ్యూల్‌ చేసిన మొత్తం 27.11 గంటలకు సంబంధించి.. 10.14 గంటలు మాత్రమే సభ పనిచేసింది. విపక్షాల ఆందోళనలతో ఏర్పడిన అంతరాయాలు, తప్పనిసరి వాయిదాల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది.

Rajya Sabha productivity
Rajya Sabha productivity
author img

By

Published : Dec 20, 2021, 7:15 AM IST

Rajya Sabha productivity: రాజ్యసభ శీతాకాల సమావేశాల ఉత్పాదకత మూడో వారంలో కనిష్ఠానికి చేరుకుంది. కేవలం 37.60 శాతం మాత్రమే నమోదైంది. 12 మంది సభ్యుల సస్పెన్షన్‌కు సంబంధించి విపక్షాల ఆందోళనలతో ఏర్పడిన అంతరాయాలు, తప్పనిసరి వాయిదాల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది.

Parliament winter session 2021

రాజ్యసభ సెక్రెటేరియట్ వివరాల ప్రకారం.. మొదటి రెండు వారాల్లో సభ ఉత్పాదకత 49.70 శాతం, 52.50 శాతంగా ఉంది. మొత్తం మూడు వారాలు కలిపి 46.70 శాతంగా నమోదైనట్లు రాజ్యసభ సెక్రెటేరియట్ తెలిపింది.

మూడో వారంలో షెడ్యూల్‌ చేసిన మొత్తం 27.11 గంటలకు సంబంధించి.. సభ కేవలం 10.14 గంటలు మాత్రమే సభ పనిచేసింది. ప్రత్యేకించి ప్రశ్నోత్తరాల సమయం బాగా వృథా అయింది. ఇందుకు కేటాయించిన సమయంలో కేవలం 11.40 శాతం మాత్రమే సద్వినియోగం అయినట్లు సెక్రెటేరియట్‌ వెల్లడించింది. జాబితా చేసిన 75 ప్రశ్నల్లో కేవలం నాలుగింటికి మాత్రమే మంత్రులు మౌఖికంగా సమాధానమివ్వగలిగారని తెలిపింది. మూడు బిల్లులు ఆమోదం పొంది, తిరిగి వచ్చాయంది. మొత్తం మూడు వారాల్లో సభ్యులు 15 సార్లు సమావేశం కాగా.. ఆరు సార్లు సభ రోజుకు గంట కంటే తక్కువ సమయం మాత్రమే పనిచేసింది.

ఇదీ చదవండి: ఆ రాష్ట్రాలకు దిల్లీ నుంచి భాజపా టీమ్స్​.. ఎక్కువ స్థానాలే టార్గెట్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.