ETV Bharat / bharat

ఐదుగురు పిల్లలతో కెనాల్​లో దూకి దంపతుల ఆత్మహత్య.. ఫోన్​లో త్రిపుల్​ తలాక్ - chattisgarh triple talak over phone

కెనాల్​లో దూకి ఓ కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. తమ ఐదుగురు పిల్లలతో సహా దంపతులిద్దరూ కెనాల్​లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మరో వైపు ఫోన్​లో భార్యకు త్రిపుల్​ తలాక్​ చెప్పిన వ్యక్తి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన రాయ్​పుర్​లో జరిగింది.

Couple jump in Narmada canal with five children

author img

By

Published : Mar 2, 2023, 7:36 AM IST

రాజస్థాన్​లో దారుణం జరిగింది. ఇద్దరు దంపతులు తమ ఐదుగురు పిల్లలతో సహా కెనాల్​లో దూకి అత్మహత్యకు పాల్పడ్డారు. ఇప్పటివరకు 9 ఏళ్ల బాలుడి మృతదేహాన్ని వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన జాలోర్​ జిల్లాలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్​ లాల్, బద్లి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరంతా సంచోర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో నివసిస్తున్నారు. అయితే తరచూ దంపతుల మధ్య గొడవలు జరుగుతుండేవి. అలా వారిద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో శంకర్​ మనస్థాపానికి గురయ్యాడు. అనంతరం సిద్ధిశ్వేర్ అనే గ్రామ సమీపంలోని నర్మద కెనాల్​ వద్దకు భార్య, ఐదుగురు పిల్లలతో సహా వెళ్లాడు. అనంతరం అందులో దూకేశారు. ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీన్ని గమనించిన గలిఫా అనే గ్రామానికి చెందిన ప్రత్యక్ష సాక్షి భన్వర్​ సింగ్​ రాజ్​పుత్​ పోలీసులకు సమాచారం అందించాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. వివరాలు సేకరించి గాలింపు చర్యలు మొదలు పెట్టారు. ఈ విషయంపై జాలోర్​ జిల్లా యంత్రాంగం స్పందించి.. మృతదేహాలను వెలికి తీయడానికి ఎస్​డీఆర్​ఎఫ్​ సిబ్బందిని ఘటనా స్థలానికి పంపించింది. కాగా, ఇప్పటివరకు శంకర్​ లాల్​ కుమారుడు 9 ఏళ్ల ప్రకాశ్​ మృతదేహాన్ని బయటకు తీశారు. మిగిలిన మృతదేహాల కోసం గాలిస్తున్నారు.

Couple jump in Narmada canal with five children
నర్మద కెనాల్​

త్రిపుల్​ తలాక్​..
ఫోన్​లో తన భార్యకు మూడుసార్లు తలాక్​ చెప్పి విడాకులివ్వబోయాడో వ్యక్తి. దీంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడు కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​లో జరిగింది.
పోలీసుల వివరాలు ప్రకారం.. మహ్మద్​ షమిన్(36), నసీమ బానో(32) అనే దంపతులు మనేంద్రగడ్​ అనే ప్రాంతంలో నివసిస్తున్నారు. వీరిద్దరికి గతేడాది సెప్టెంబర్ 9న వివాహం జరిగింది. పెళ్లైన కొద్ది రోజులు బాగానే ఉన్న మహ్మద్​.. ఆ తర్వాత నుంచి నసీమను వేధించేవాడు. 'నీ చర్మం డ్రైగా ఉంది. నేను ఇంకొకరిని పెళ్లిచేసుకుంటాను. నువ్వు మీ పుట్టింటికి వెళ్లిపో' అంటూ తరచూ నసీమతో గొడవ పడేవాడు. కాగా, పుట్టింట్లో ఉన్న నసీమకు ఫోన్​లో మూడు సార్లు తలాక్​ చెప్పి విడాకులిచ్చాడు. దీంతో మనస్తాపానికి గురైన నసీమ.. మానసికంగా కుంగిపోయింది. అనంతరం పోలీసులను ఆశ్రయించి.. మహ్మద్​ షమిన్​పై ఫిర్యాదు చేసింది. దీంతో బుధవారం మహ్మద్​ షమిన్​ను పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై 498 ఏ, సెక్షన్​ 4, వివాహ హక్కుల చట్టం 2019. సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరు పరిచారు.

triple talaq
నిందితుడు మహ్మద్​ షమిన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.