ETV Bharat / bharat

అసెంబ్లీ పోరు.. ఎలక్షన్​ ఐకాన్​గా రాజమౌళి.. ఓటింగ్​ శాతం పెరగనుందా? - రాయ్​చూర్​ ఎలక్షన్​ ఐకాన్​

దర్శకుడు ఎస్​ఎస్​ రాజమౌళి ఎన్నికల ఐకాన్​గా నియమితులయ్యారు. కర్ణాటకలోని రాయ​చూర్​ జిల్లాకు.. రాజమౌళిని ఎన్నికల ఐకాన్​గా నియమిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

Rajamouli appointed as election icon of Raichur district karnataka
కర్ణాటక ఎలక్షన్​గా ఐకాన్​గా రాజమౌళి
author img

By

Published : Mar 9, 2023, 8:14 PM IST

Updated : Mar 9, 2023, 8:19 PM IST

ప్రముఖ తెలుగు దర్శకుడు ఎస్​ఎస్​ రాజమౌళి ఎన్నికల ఐకాన్​గా నియమితులయ్యారు. కర్ణాటకలోని రాయ​చూర్​ జిల్లాకు.. ఆయన ఎన్నికల ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు. రాజమౌళిని రాయ​చూర్​ జిల్లా ఎన్నికల ప్రచారకర్తగా నియమించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం​ గురువారం తెలిపింది. 2023 కర్ణాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని ఓటర్లలందరూ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునే విధంగా రాజమౌళి అవగాహన కల్పిస్తారని వెల్లడించింది. రాయ​చూర్​ జిల్లా కలెక్టర్​ చంద్రశేఖర్ కూడా ఇదే విషయాన్ని ప్రకటించారు.

రాజమౌళి.. రాయ​చూర్ జిల్లా, మానవి తాలుకాలోని అమరేశ్వర్​ క్యాంప్​కు చెందినవారు. ఆ తర్వాత ఆయన కుటుంబం తెలుగు రాష్ట్రాల్లో స్థిరపడింది. అందుకే రాయచూర్​ కలెక్టర్ చంద్రశేఖర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. "పలు విజయవంతమైన సినిమాలు తీసిన రాజమౌళి.. దేశంలోని చాలా మందికి సుపరిచితమే. అందుకే రాజమౌళికి ఈ బాధ్యతలకు అప్పగిస్తున్నాం. ప్రజలు ఆయనను సులువుగా గుర్తిస్తారు. రాజమౌళి ప్రచారం చేస్తే ఓటింగ్​ శాతం పెరిగే అవకాశం ఉంది. రాయ​చూర్​ జిల్లా ఎన్నికల ఐకాన్​గా ఉండేందుకు రాజమౌళి కూడా అంగీకరించారు" అని కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.

ఎన్నికల ప్రచారకర్తల విధులు..
ఎన్నికల ఐకాన్​గా నియమితులైన వ్యక్తులు.. ఓటర్లలో అవగాహన కల్పిస్తారు. ఎన్నికల కమిషన్​ సూచించిన విధంగా ప్రజలకు సందేశాన్ని అందిస్తారు. వీడియోలు, ఇతర మాధ్యమాల రూపంలో ప్రజలకు చైతన్యం కల్పిస్తారు. ఈ సందేశాలు, చేసే ప్రచారం ఏ పార్టీకి అనుకూలంగా ఉండవు. కేవలం ప్రజలకు ఓటు హక్కుపై అవగాహన మాత్రమే వీరు కలిగిస్తారు. ఎన్నికల ప్రచారకర్తలుగా దేశంలో పేరొందిన వారిని నియమిస్తూ ఉంటారు.

రాజమౌళి-ఆర్‌ఆర్‌ఆర్​..
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ 2022లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఎన్టీఆర్‌ - రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా దాదాపు రూ.1200కోట్ల వరకు వసూలు చేసింది. ఇకపోతే ఈ చిత్రానికి ఇప్పటికే పలు అవార్డులు రాగా.. ఇటీవలే 'నాటు నాటు' సాంగ్​కు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు వరించింది. ఇక క్రిటిక్స్​ ఛాయిస్​ అవార్డ్స్​లో రెండు పురస్కారాలను దక్కించుకుంది. 'ఆర్​ఆర్​ఆర్​' ఆస్కార్ బరిలో నిలించింది.

2020లో 'పంజాబ్​ ఎన్నికల ఐకాన్​'గా సోనూసూద్​..
ప్రముఖ నటుడు సోనూసూద్​ను కూడా 2020లో 'పంజాబ్​ ఎన్నికల ఐకాన్​'గా నియామకం అయ్యారు. ఆయనను పంజాబ్ ఐకాన్​గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ఎన్నికల​ కమిషన్. అప్పటి పంజాబ్​ రాష్ట్ర ఎన్నికల అధికారి ఎస్​. కరుణ రాజు సోనూసూద్​ను 'పంజాబ్​ ఎన్నికల ఐకాన్​'గా నియమిస్తు నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్​ మోగా జిల్లాకు చెందిన సోనూసూద్​ లాక్ డౌన్​ సమయంలో వలసకూలీలను ప్రత్యేక బస్సుల్లో ఇళ్లకు చేర్చి, వారి పాలిట ఆపద్బాంధవుడిగా మారారు. మానవత్వాన్ని చాటుకొని అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యారు.

Last Updated : Mar 9, 2023, 8:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.