ETV Bharat / bharat

'మసీదులపై అవి తీసేయాల్సిందే'.. కేసు పెట్టినా వెనక్కితగ్గని ఠాక్రే - raj thackeray loudspeaker

Raj Thackeray loudspeaker: మసీదులపై లౌడ్ స్పీకర్లు తొలగించాలని వివాదాస్పద పిలుపునిచ్చిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్​ఠాక్రేపై కేసు నమోదైంది. మంగళవారం రాత్రి ఆయనకు పోలీసులు నోటీసు అందించారు. అయితే, తన వ్యాఖ్యలపై ఠాక్రే వెనక్కి తగ్గలేదు.

Raj Thackeray Loudspeaker Row
Raj Thackeray Loudspeaker Row
author img

By

Published : May 4, 2022, 6:46 AM IST

Raj Thackeray loudspeaker: మసీదులపై లౌడ్‌ స్పీకర్లు ఈ నెల నాలుగో తేదీ నుంచి మూగబోయేలా చేయాలంటూ వివాదాస్పద పిలుపునిచ్చిన మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) అధ్యక్షుడు రాజ్‌ఠాక్రేపై ఔరంగాబాద్‌ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఠాక్రే పాల్గొన్న సభను నిర్వహించినవారిపైనా కేసు పెట్టారు. ఈ నెల ఒకటో తేదీన ఔరంగాబాద్‌లో జరిగిన సభలో ఠాక్రే మాట్లాడుతూ.. మసీదులపై లౌడ్‌ స్పీకర్లను తొలగించని పక్షంలో బుధవారం నుంచి వాటి ఎదురుగా హనుమాన్‌ చాలీసా వినిపించాలని ప్రజల్ని కోరారు. ఆ నేపథ్యంలో ఉన్నతస్థాయి సమీక్షానంతరం పోలీసు విభాగంలో సెలవుల్ని తాత్కాలికంగా రద్దుచేశారు. పలుచోట్ల ఎంఎన్‌ఎస్‌ కార్యకర్తల్ని అరెస్టు చేయడం ప్రారంభించారు.

14 ఏళ్ల క్రితం నాటి కేసులో..: ఠాక్రే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ 2008లో నమోదైన కేసులో ఆయనపై బెయిల్‌కు వీల్లేని వారెంటును మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలో న్యాయస్థానం జారీ చేసింది. జూన్‌ 8లోగా ఆయన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని ముంబయి పోలీసుల్ని ఆదేశించింది.

అయినా అదే మాట: ఠాక్రేకు మంగళవారం రాత్రి పోలీసులు నోటీసు అందించారు. ఆయన తన వ్యాఖ్యల నుంచి ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. మసీదుల నుంచి ఆజాన్‌ వినిపిస్తే వెంటనే 100కు డయల్‌ చేసి పోలీసు కంట్రోల్‌ రూంకు చెప్పడంతో పాటు హనుమాన్‌ చాలీసాను లౌడ్‌ స్పీకర్లలో వినిపించాలని ప్రజలకు మరోసారి పిలుపునిచ్చారు. రోజూ ఈ విధంగానే చేయాలనీ, అప్పుడే శబ్దాల ఆటంకం గురించి తెలుస్తుందన్నారు. ఆసుపత్రులు, పాఠశాలల వద్ద శబ్దాలు చేయకూడదంటూ హిందువుల పండుగలపై ఆంక్షలు విధించి, మసీదులకు మాత్రం దానినుంచి మినహాయింపు ఇచ్చారని విమర్శించారు.

ఇదీ చదవండి: ఒకే ప్రాంగణంలో హారతి, అజాన్​.. వెల్లివిరిసిన మత సామరస్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.