ETV Bharat / bharat

రైల్వే మెలిక.. సర్వీస్ ఛార్జ్ తొలగించి.. అసలు ధరకు కలిపేసి.. - రైల్వే సర్వీస్ ఛార్జ్ తొలగింపు

ప్రీమియం రైళ్లలో సరఫరా చేసే ఆహార పదార్థాలపై సర్వీస్ ఛార్జీని రద్దు చేస్తూ రైల్వే నిర్ణయం తీసుకుంది. అయితే, రద్దు చేసిన సర్వీస్ ఛార్జీని.. ఆహార పదార్థాల ధరల్లో కలిపేసి ప్రయాణికులకు మెలిక పెట్టింది.

railway service charge
railway service charge
author img

By

Published : Jul 19, 2022, 10:53 PM IST

సర్వీస్ ఛార్జీలపై భారతీయ రైల్వే మాయాజాలం చేసింది. ప్రీమియం రైళ్లలో ఆహారంపై విధించే ఆన్​బోర్డ్ సర్వీస్ ఛార్జీని రద్దు చేసింది. ప్రస్తుతం.. ముందస్తుగా ఆర్డర్ చేయని ఆహార పదార్థాలకు సైతం రూ.50 సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తుండగా.. ఇప్పుడు ఆ పద్ధతికి స్వస్తి పలికింది. అయితే, అంతే మొత్తాన్ని ఆహార పదార్థాల అసలు ధరల్లో కలిపేసింది.

మాయాజాలం ఇలా...
గతంలో అల్పాహారానికి రూ.105, లంచ్​కు రూ.185, స్నాక్స్​కు రూ.90 వసూలు చేసిన రైల్వే.. అన్నింటికీ అదనంగా రూ.50 సర్వీస్ ఛార్జీ వడ్డించేది. ఇప్పుడు రూ.50 సర్వీస్ ఛార్జీని తొలగించింది. అయితే, ఇక్కడే ఓ మెలిక పెట్టింది. అల్పాహారం ధరను రూ.155కు, లంచ్ ధర రూ.235కు, స్నాక్స్ ధర రూ.140కి పెంచేసింది. దీంతో వినియోగదారులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.

సర్వీస్ ఛార్జీ తొలగింపు కేవలం టీ, కాఫీ ధరలపై మాత్రమే ప్రభావం చూపనుంది. ముందుగా బుకింగ్ చేసుకున్న ప్రయాణికులకైనా, రైలు ఎక్కిన తర్వాత ఆర్డర్ చేసే ప్రయాణికులకైనా ఇకపై టీ, కాఫీల ధరలు ఒకే విధంగా ఉండనున్నాయి. గతంలో ముందస్తు బుకింగ్ చేసుకోని ప్రయాణికుడు టీ కోసం రూ.70 వెచ్చించాల్సి వచ్చేది. ఇటీవల ఈ విషయంపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఒక్క టీ కోసం రూ.70 చెల్లించడం ఏంటని నెటిజన్లు ప్రశ్నించారు. అందులోనూ 20 రూపాయల టీ కోసం రూ.50 సర్వీస్ ఛార్జీలు వసూలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రైల్వే తాజా దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.