ETV Bharat / bharat

బాపూ స్మరణలో రాహుల్​ గాంధీ - మహాత్మ గాంధీ

మహాత్మ గాంధీ కేవలం మాటలు చెప్పడమే కాకుండా వాటిని ఆచరణలో పెట్టేవారని అన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. వయనాడ్​ పర్యటనలో ఉన్న ఆయన.. బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Mahatma Gandhi
రాహుల్ గాంధీ
author img

By

Published : Aug 16, 2021, 4:40 PM IST

జాతి పిత మహాత్మ గాంధీ ఏది చెప్పినా అది ఆచరణలో పెట్టేవారన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కేరళలోని సొంత నియోజకవర్గం వయనాడ్​లో తొలి రోజు పర్యటనలో ఉన్న రాహుల్​.. జాతి పిత విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాపూజీ విగ్రహాన్ని చూసినప్పుడు ఆయన చేసిన మంచి పనులు, జీవనశైలి గుర్తుకు వస్తాయని చెప్పారు.

"భారత్..​ మతసహనం పాటించాలని చెప్పారంటే.. గాంధీజీ కూడా సహనశీలిగా ఉండేవారు. మహిళలను గౌరవించాలని చెప్పారంటే.. తానూ పాటించేవారు. భారత్​.. లౌకిక దేశంగా ఉండాలని అన్నారంటే తానూ అలాగే వ్యవహరించేవారు."

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత

రెండు రోజుల వయనాడ్ పర్యటన కోసం ఉదయం కోజికోడ్​ చేరుకున్న రాహుల్.. క్లాట్​ ఉత్తీర్ణత సాధించిన గిరిజన విద్యార్థులతో మధ్యాహ్న భోజనం చేశారు. వారు దేశంలోని అత్యున్నత న్యాయస్థానాల్లో పనిచేయాలని ఆకాంక్షించారు. అనంతరం వయనాడ్​లో ఎంపీల్యాడ్స్​ నిధుల కింద ఓ తాగు నీటి ప్రాజెక్టును ప్రారంభించారు.

ఇదీ చూడండి: 'ఏడేళ్లుగా ప్రధాని మోదీది అదే ప్రసంగం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.