అంతకంతకూ పెరుగుతోన్న ఇంధన ధరలపై కాంగ్రెస్‌నేత రాహుల్ గాంధీ ఆందోళన చేపట్టారు. ఈ మేరకు పార్లమెంట్‌కు సైకిల్ తొక్కుతూ వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికే దేశంలోని చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 100 దాటింది. పార్లమెంట్లో వాయిదాల పర్వం కొనసాగుతుండగా.. సభ వెలుపల ప్రతిపక్షపార్టీలు మాక్ సెషన్లను నిర్వహించడం ద్వారా నిరసనలను తీవ్రతరం చేశాయి. ఈ క్రమంలో అల్పాహార సమావేశం పేరుతో దిల్లీ కానిస్టిట్యూషన్ క్లబ్‌లో రాహుల్.. 15 ప్రతిపక్షపార్టీల నాయకులతో సమావేశమయ్యారు.
"నా దృష్టిలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మనమంతా ఓ శక్తిగా ఏకం కావాలి. అప్పుడే సభలో ప్రజల వాణిని ఐక్యంగా వినిపించగలం. దీంతో అది మరింత శక్తిమంతంగా మారుతుంది. లేకపోతే భాజపా-ఆర్ఎస్ఎస్ను ఎదుర్కోవడం చాలా కష్టమైన పని."
రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత.
ఈ సమావేశానికి కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన, ఆర్జేడీ, ఎస్పీ, సీపీఐ, సీపీఎం, ఆరెస్పీ, జేఎంఎం, నేషనల్ కాన్ఫరెన్స్, తృణమూల్ కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఈ భేటీకి హాజరుకాలేదు.
ఇదీ చూడండి: 'కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమే.. ఇక చర్చలొద్దు'