ETV Bharat / bharat

'పొలిటిక‌ల్ క్లియ‌రెన్స్' లేకుండానే లండ‌న్ వెళ్లిన రాహుల్‌? - రాహుల్​ గాంధీ లండన్​ పర్యటన

Rahul Gandhi London Visit: ప్ర‌స్తుతం లండ‌న్ పర్య‌ట‌న‌లో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. భార‌త విదేశాంగ శాఖ నుంచి పొలిటిక‌ల్ క్లియ‌రెన్స్ రాకుండానే వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లే స‌మ‌యంలో పార్ల‌మెంట్ స‌భ్యులంద‌రూ విదేశాంగ శాఖ క్లియ‌రెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధ‌న‌ను రాహుల్ గాంధీ బేఖాత‌రు చేసిన‌ట్లు సమాచారం.

Rahul Gandhi London Visit
Rahul Gandhi London Visit
author img

By

Published : May 25, 2022, 8:34 PM IST

Rahul Gandhi London Visit: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ.. ప్రస్తుతం లండన్​ పర్యటనలో ఉన్నారు. అయితే ఈ పర్యటనకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి రాజకీయ ఆమోదం తీసుకోకుండా వెళ్లారని సమాచారం. ఎంపీలు విదేశాలకు వెళ్లే ముందు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి రాజకీయ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఏ ఎంపీ అయినా.. విదేశీ ప‌ర్య‌ట‌నకు సంబంధించిన స‌మాచారాన్ని విదేశాంగ శాఖ వెబ్‌సైట్‌లో క‌నీసం మూడు వారాల ముందే ఉంచాలి. ఈ నిబంధ‌న‌ను రాహుల్ గాంధీ పాటించలేదని సమాచారం.

విదేశాల నుంచి నేరుగా ఆహ్వానం ఉంటే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లి రాజకీయ ఆమోదం పొందాల్సి ఉంటుందని బుధవారం ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఈ విషయంలో గతంలోనే నిబంధనలు రూపొందించినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అయితే వీటిని తిప్పికొట్టింది కాంగ్రెస్‌ పార్టీ. అధికారిక విదేశీ పర్యటనలు కానప్పుడు ఎంపీలు.. ప్రధాని నుంచో, ప్రభుత్వం నుంచో రాజకీయ పరమైన అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని కాంగ్రెస్‌ నాయకులు వ్యాఖ్యానించారు. ప్రధాని కార్యాలయం వాట్సాప్​ నుంచి వచ్చే సందేశాలను గుడ్డిగా ఫాలో కావద్దంటూ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా ట్వీట్​ చేశారు.

BJP on Rahul Gandhi Jeremy meet: లండన్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ.. సోమవారం బ్రిటన్​ రాజకీయ నాయకుడు జెరెమీని కలిశారు. భారతీయ ప్రవాస కాంగ్రెస్ ఈ ఫొటోను షేర్ చేసింది. దీంతో దేశంలో రాజకీయ దుమారం రేగింది. ఈ నేపథ్యంలో స్పందించిన పలువురు భాజపా సీనియర్ నేతలు.. రాహుల్​పై మండిపడ్డారు. కశ్మీర్ వేర్పాటును ప్రోత్సహించే అతడిని రాహుల్ కలిశారని ధ్వజమెత్తారు. కాగా, భాజపా ఆరోపణలను కాంగ్రెస్ ప్రధాన ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా తిప్పికొట్టారు. పరస్పర విభిన్న భావజాలాలు ఉన్న రెండు దేశాల రాజకీయ నాయకులు గతంలోనూ కలుసుకున్నారని, భవిష్యత్​లోనూ కలుసుకుంటారని అన్నారు. జెరెమీతో మోదీ సమావేశం కావడంపై ప్రశ్నలు సంధించారు. ఓ బహిరంగ సమావేశంలో మెహుల్ ఛోక్సీని సోదరుడిగా పిలుస్తూ మోదీ చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నించాలని మీడియాను కోరారు.

ఇవీ చదవండి: కశ్మీర్​ వేర్పాటువాద నేత యాసిన్​మాలిక్​కు జీవితఖైదు

చిదంబరం మెడకు మరో ఉచ్చు.. వీసా కుంభకోణంపై ఈడీ కేసు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.