ETV Bharat / bharat

నిరసన చేస్తుండగా కాల్పులు.. పంజాబ్​ శివసేన నేత దారుణ హత్య - పంజాబ్​ గోపాల్​ టెంపుల్​ వివాదం

పంజాబ్​ శివసేన (టక్సాలి) పార్టీనేతపై ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. రెండు రౌండ్ల కాల్పులు జరపగా.. శివసేన నేత అక్కడికక్కడే కుప్పకూలాడు.

shiva sena leader murdered
శివసేన పార్టీనేత సుధీర్‌ సూరి
author img

By

Published : Nov 4, 2022, 8:33 PM IST

Updated : Nov 4, 2022, 11:00 PM IST

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో శివసేన(టక్సాలి) పార్టీనేత దారుణ హత్యకు గురయ్యాడు. ఓ ఆలయం ఎదుట నిరసన తెలియచేస్తున్న శివసేన(టక్సాలి) హిందుస్థాన్ అధ్యక్షుడు సుధీర్‌ సూరిపై దుండగుడు రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలాడు. అయితే స్థానికంగా ఉండే గోపాల్​ ఆలయం సమీపంలోని ఓ చెత్త కుప్పలో దేవతా విగ్రహాలు కనిపించాయని సుధీర్‌ రోడ్డుపై బైఠాయించి ధర్నాచేశారు. దీనిపై ఆలయ కమిటీకి సుధీర్‌ సూరికి మద్య వాగ్వాదం నడిచినట్లు స్థానికులు తెలిపారు.

అదే సమయంలో గుంపులోంచి వచ్చిన ఓ దుండగుడు ఆయనపై కాల్పులు జరిపాడు. దీంతో సుదీర్​ అక్కడిక్కడే మృతి చెందాడు. అనంతరం దుండగుడు గాల్లోకి కాల్పులు జరుపుతూ అక్కడి నుంచి పరారయ్యాడని స్థానికులు వెల్లడించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుధీర్‌సూరికి ప్రాణహాని ఉందన్న కారణాలతో పంజాబ్‌ ప్రభుత్వం కొద్ది రోజులుగా ఆయనకు భద్రత కల్పిస్తోంది. అయినా ఈ ఘటన జరగడం గమనార్హం.

"సుదీర్​ హత్య గురించి 3.50 నుంచి 4 గంటల సమయంలో కంట్రోల్​ రూమ్​కు ఒక ఫోన్​ కాల్​ వచ్చింది. ఆసుపత్రికి తరలించే కంటే ముందే అతను చనిపోయాడు. ప్రస్తుతం నిందితున్ని అదుపులోకి తీసుకున్నాం. అతని నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాం. అమృత్​సర్​ ప్రజలు శాంతి భద్రతలు పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం" అని పోలీస్​ కమీషనర్​ అరుణ్​పాల్​ సింగ్​ తెలిపారు.

Last Updated : Nov 4, 2022, 11:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.