ETV Bharat / bharat

పంజాబ్ కీలక నేతల నామినేషన్- 94 ఏళ్ల వయసులో బాదల్ రికార్డు - కెప్టెన్ అమరీందర్ సింగ్ తాజా వార్తలు

Punjab Election 2022: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్​జీత్ సింగ్ చన్నీ, కెప్టెన్​ అమరీందర్​ సింగ్​ నామినేషన్లు దాఖలు చేశారు. వీరితోపాటు పంజాబ్ మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్, ఇతర ముఖ్యనేతలు నామినేషన్ ప్రక్రియను పూర్తిచేశారు. అయితే ఎన్నికల చరిత్రలోనే 94 ఏళ్ల వయసులో పోటీ చేస్తున్న ఏకైక అభ్యర్థి బాదలే కావడం విశేషం.

Punjab Election 2022
పంజాబ్ ఎన్నికలు
author img

By

Published : Jan 31, 2022, 2:32 PM IST

Updated : Jan 31, 2022, 4:20 PM IST

Punjab Election 2022: ఫిబ్రవరి 20న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పంజాబ్ సీఎం చరణ్​ జీత్​ సింగ్​ చన్నీ నామినేషన్ దాఖలు చేశారు. భదౌర్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నామపత్రాలు సమర్పించారు.

చన్నీ రెండు స్థానాల్లో పోటీ చేయనున్నారు. భదౌర్​, ఛంకౌర్​ సాహిబ్​ నియోజకవర్గాల్లో సీఎం పోటీ చేస్తారని పార్టీ ఇప్పటికే స్పష్టం చేసింది.

Punjab Election 2022
నామినేషన్ సమర్పిస్తున్న పంజాబ్ సీఎం చన్నీ
Punjab Election 2022
కలెక్టర్ కార్యాలయంలో సీఎం చన్నీ

పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్​ నామినేషన్ దాఖలు చేశారు. పాటియాలా నియోజకవర్గం అభ్యర్థిగా నామపత్రాలు సమర్పించారు.

Punjab Election 2022
నామినేషన్ వేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్

పంజాబ్ మాజీ సీఎం, శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్ నామినేషన్ సమర్పించారు. ఆయన లంగీ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. అయితే 94 ఏళ్ల వయసులో ఎన్నికల్లో పోటీ చేస్తూ ఆయన అరుదైన ఘనత సాధించారు. భారత ఎన్నికల చరిత్రలో నామినేషన్ దాఖలు చేసిన అతిపెద్ద వయస్కుడు బాదలే కావడం గమనార్హం. అంతకుముందు ఈ రికార్డు కేరళ మాజీ సీఎం వీఎస్ అచ్యుతానంద్ పేరిట ఉంది. ఆయన 2016 ఎన్నికల్లో 92 ఏళ్ల వయసులో సీపీఎం తరఫున పోటీ చేశారు.

Punjab Election 2022
నామినేషన్​ సమర్పిస్తున్న ప్రకాశ్ సింగ్ బాదల్

శిరోమణి అకాలీదళ్​ పార్టీ అధ్యక్షులు సుఖ్​బీర్​ సింగ్​ బాదల్ జలాలాబాద్ నియోజకవర్గం అభ్యర్థిగా నామపత్రాలు దాఖలు చేశారు.

పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 20న జరగనున్నాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉండనుంది.​

ఇవీ చూడండి: రెండు స్థానాల్లో సీఎం చన్నీ పోటీ.. కెప్టెన్​పై పోటీకి మాజీ మేయర్​

Last Updated : Jan 31, 2022, 4:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.