ETV Bharat / bharat

సీఎం రెండో పెళ్లి.. గురువారమే ముహూర్తం.. వధువు ఎవరంటే.. - భగవంత్​ మాన్ రెండో వివాహం రేపే

Cm Second Marriage: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్​ గురువారం పెళ్లి చేసుకోనున్నారు. అతికొద్ది మంది అతిథుల సమక్షంలో డాక్టర్ గురుప్రీత్​ కౌర్​ను ఆయన వివాహమాడనున్నారు. మరోవైపు, పంజాబ్‌లో ఉచిత విద్యుత్తు నిర్ణయం ఆమోదం పొందింది. గృహ వినియోగదారులు ఒక్కో బిల్లింగ్​ సైకిల్​లో 600 యూనిట్ల వరకు ఉచితంగానే విద్యుత్​ను పొందొచ్చని సీఎం వెల్లడించారు.

Punjab CM Bhagwant Mann is going to get married for the second time tomorrow.

author img

By

Published : Jul 6, 2022, 2:05 PM IST

Updated : Jul 6, 2022, 6:32 PM IST

Punjab Cm Bhagavant Mann Second Marriage: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ వివాహం​ గురువారం చంఢీగఢ్​లో జరగనుంది. డాక్టర్​ గురుప్రీత్​ కౌర్​ను ఆయన పెళ్లాడనున్నారు. చంఢీగఢ్​ సెక్టార్​ 8లోని ఓ గురుద్వారా అత్యంత నిరాడంబరంగా, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్.. మాన్​ పెళ్లికి హాజరుకానున్నారు.

భగవంత్ మాన్​కు ఇంతకుముందే పెళ్లయింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే.. ఆరేళ్ల క్రితం ఆయన మొదటి భార్యకు విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత ఆమె, ఇద్దరు పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. ఇటీవల పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఇద్దరు పిల్లలు హాజరయ్యారు.

Punjab CM Bhagwant wife
డాక్టర్ గురుప్రీత్ కౌర్

కీలక​ సమావేశం.. పంజాబ్​లో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆప్​.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే క్రమంలో ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది. దీంట్లో భాగంగానే సీఎం భగవంత్ మాన్ బుధవారం మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. పంజాబ్ కేబినెట్ విస్తరణ తర్వాత నేడు(బుధవారం) తొలి మంత్రివర్గ​ సమావేశం జరిగింది. చంఢీగఢ్‌లోని సెక్రటేరియట్​లో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కొత్త, పాత మంత్రులందరూ హాజరయ్యారు. సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు.

ఉచిత విద్యుత్‌కు ఓకే.. "పంజాబ్ ప్రజలకు మేము ఇచ్చిన అతి పెద్ద హామీ ఉచిత విద్యుత్తు నిర్ణయం ఆమోదం పొందింది. ఇక నుంచి పంజాబ్ ప్రజలకు ఒక్కో బిల్లింగ్ సైకిల్​లో 600 యూనిట్ల ఉచిత విద్యుత్ లభిస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి తీరుతాం" అని కేబినెట్ సమావేశం అనంతరం సీఎం భగవంత్​ మాన్​ ట్వీట్​ చేశారు.

ఇవీ చదవండి: 'నుపుర్ తల తెచ్చిస్తే ఇల్లు రాసిస్తా'.. మత గురువు ప్రకటన.. నిందితుడు అరెస్ట్

ఠాక్రేపై 'ఆటో- మెర్సిడెస్' పంచ్.. డ్రమ్స్ వాయిస్తూ శిందేకు భార్య స్వాగతం

Last Updated : Jul 6, 2022, 6:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.