కన్నడ అగ్రనటుడు పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం (Puneeth Rajkumar Death).. ప్రజల్లో ఆరోగ్యంపై భయాలను పెంచేసింది. శారీరకంగా దృఢంగా ఉండే పునీత్.. గుండెపోటుతో మరణించిన నేపథ్యంలో తమ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షల (Heart Check up Tests) కోసం ఆస్పత్రులకు తరలివెళ్తున్నారు.
బెంగళూరులోని జయదేవ ఆస్పత్రికి (Jayadeva Hospital Bangalore) ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడం వల్ల... బయట భారీగా క్యూ ఏర్పడింది. సాధారణంగా 1,200 మంది రోగులు వచ్చే ఈ ఆస్పత్రికి సోమవారం 1,600 మంది వచ్చారని వైద్యులు చెబుతున్నారు. పునీత్ మరణం తర్వాత ఓపీడీ రోగుల సంఖ్య భారీగా పెరిగిందని తెలిపారు. గుండె జబ్బులు ఉన్నవారితో పాటు రోజూ జిమ్‌కు వెళ్లేవారు, ఆరోగ్యంగా ఉన్నవారు సైతం ఆస్పత్రికి వస్తున్నట్లు వెల్లడించారు.
మైసూరులోని జయదేవ ఆస్పత్రికి సైతం రోగుల తాకిడి పెరిగిందని ఈ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సీఎన్ మంజునాథ్ తెలిపారు. సాధారణం కంటే 25 శాతం అధికంగా రోగులు వస్తున్నారని వెల్లడించారు. ఈసీజీ వంటి పరీక్షలు ఎక్కువగా చేయించుకుంటున్నారని చెప్పారు.
జిమ్ చేస్తూ...
అక్టోబర్ 29న పునీత్ రాజ్‌కుమార్ కన్నుమూశారు. జిమ్‌లో కసరత్తులు చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలారు. గుండెలో నొప్పిగా ఉందని చెప్పడం వల్ల, ఆయన సిబ్బంది వెంటనే దగ్గర్లోని రమణశ్రీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారు.
ఇదీ చదవండి: