కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రాపై (Priyanka Gandhi news) ఉత్తర్ప్రదేశ్ సీతాపుర్ పోలీసులు కేసు నమోదు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారంటూ ప్రియాంక సహా 11 మందిపై కేసు పెట్టారు.
లఖింపుర్ ఖేరి హింస (Lakhimpur Kheri incident) బాధితులను పరామర్శించేందుకు ఆ ప్రాంతానికి వెళ్తున్న క్రమంలో ప్రియాంకను (Priyanka Gandhi news today) సీతాపుర్ పోలీసులు నిర్బంధించారు. ఎలాంటి ఉత్తర్వులు, ఎఫ్ఐఆర్ లేకుండా 28 గంటల నుంచి తనను బంధించారని (Lakhimpur Kheri incident) మంగళవారం ఉదయమే ప్రియాంక ఆరోపించారు.
అయితే.. ప్రియాంకా గాంధీ, దేవింద్ర హుడా, అజయ్ కుమార్ లల్లూపై ఐపీసీ సెక్షన్ 107/16 ప్రకారం కేసు నమోదు చేసినట్లు హరాగావ్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ బ్రిజేశ్ త్రిపాఠీ పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో.. ప్రియాంకను అరెస్టు చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
ఇది సిగ్గుచేటు..
ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi news) నిర్బంధం చట్టవిరుద్ధమని, సిగ్గుచేటు అని విమర్శించారు కాంగ్రెస్ నేత పి. చిదంబరం. సూర్యోదయానికి ముందు.. ఉదయం 4.30 గంటల సమయంలో.. ఒక పురుష పోలీసు అధికారి ఆమెను అరెస్టు చేశారని, ఇంతవరకు న్యాయస్థానం ముందు ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించారు.
ఉత్తర్ప్రదేశ్లో సమన్యాయం లేదని, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చట్టం, ఆయన ఆదేశాల మేరకు పోలీసులు నడుచుకుంటున్నారని ఆరోపించారు.
హింసతోనే బదులు..
యోగి ప్రభుత్వంపై విరుచుకుపడిన ప్రియాంకా గాంధీ(Priyanka Gandhi news).. గళమెత్తుతున్న ప్రజలను హింస, అణచివేతకు గురిచేస్తోందని అన్నారు. లఖింపుర్ ఖేరీ (Lakhimpur kheri news) సంఘటనే ఇందుకు రుజువు అని పీటీఐ ముఖాముఖిలో వ్యాఖ్యానించారు.
ప్రధాని నరేంద్ర మోదీపైనా తీవ్రంగా స్పందించారు ప్రియాంక.
''ఓ కార్యక్రమం కోసం లఖ్నవూ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. లఖింపుర్ ఖేరీకి ఎందుకు వెళ్లరు. 15 నిమిషాల్లో హెలికాప్టర్లో వెళ్లొచ్చు. దారుణ హత్యకు గురై కుమారులు చనిపోయిన బాధలో ఉన్న కుటుంబాల కన్నీళ్లు తుడవొచ్చు.''
- ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
రాష్ట్రంలో తీవ్రమైన పరిస్థితులు నెలకొన్నాయని, నిరసనలు చేసేందుకు ఎవరు ప్రయత్నించినా.. టీచర్లు, విద్యార్థులైనా కొట్టి జైలుకు పంపడమే ఈ ప్రభుత్వానికి తెలుసని దుయ్యబట్టారు ప్రియాంక(Priyanka Gandhi news).
మంత్రి రాజీనామా చేయాలని, నిందితులకు శిక్ష పడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారని, తనకూ అదే కావాలని చెప్పారు.
8 మంది మృతి..
ఆదివారం జరిగిన లఖింపుర్ ఖేరి హింస (Lakhimpur kheri news) ఘటనలో 8 మంది చనిపోయారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్ ఢీకొట్టిన కారణంతోనే.. ముగ్గురు రైతులు మరణించారని, మరొకర్ని మంత్రి కుమారుడు హత్య చేశాడని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ప్రకటన విడుదల చేసింది. అయితే దీనిని ఖండించిన అజయ్ మిశ్రా.. ఘటన జరిగిన సమయంలో తన కుమారుడు అక్కడ లేడని, కొందరు దుండగులు రైతుల్లో కలిసి కారుపై రాళ్లు విసరడంతోనే దురదృష్టకర సంఘటన (Lakhimpur kheri incident) జరిగిందని తెలిపారు.
ఇదీ చదవండి: ఇంకా నిర్బంధంలోనే ప్రియాంక- కాంగ్రెస్ కార్యకర్తల తీవ్ర నిరసన