ETV Bharat / bharat

priyanka gandhi up election: ప్రియాంక పోటీ చేస్తే.. ఎక్కడి నుంచి? - priyanka gandhi up cm

ఉత్తరప్రదేశ్​ శాసనపోరు బరిలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (priyanka gandhi up election) వాద్రా నిలుస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. అదే నిజమైతే ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేదానిపై ఆసక్తికర ఊహాగానాలు వెలువడుతున్నాయి. గాంధీ కుటుంబానికి ఎంతో ఆదరణ ఉన్న అమేఠీ నుంచే ప్రియాంక పోటీ చేస్తే భాజపా నుంచి తీవ్ర పోటీ తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.

up election 2022
ఉత్తర్ ప్రదేశ్ న్యూస్
author img

By

Published : Sep 16, 2021, 10:57 AM IST

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో (up polls 2022) కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా (priyanka gandhi up election) పోటీ చేస్తారన్న సమాచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆమె.. రాష్ట్ర ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు కూడా. ఇదే జరిగితే గాంధీ కుటుంబ సభ్యుల్లో అసెంబ్లీకి పోటీపడిన తొలి వ్యక్తి ఆమే అవుతారు. జవహర్‌లాల్‌ నెహ్రూ నుంచి రాహుల్‌ గాంధీ వరకు ప్రతి తరం సభ్యులు ఇప్పటివరకు లోక్‌సభ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేశారు.

ప్రియాంక ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. కుటుంబాన్ని ఎంతో కాలంగా ఆదరిస్తున్న అమేఠీ లేదంటే రాయ్‌బరేలి అసెంబ్లీ స్థానాలను ఎంచుకోవచ్చని అంటున్నారు. ఇటీవల కాలంలో ఈ రెండు చోట్ల చురుగ్గా తిరుగుతుండడం వల్ల ఆ అభిప్రాయం బలపడింది.

అక్కడైతే తీవ్ర పోటీ!

అమేఠీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన రాహుల్‌ గాంధీని భాజపా నాయకురాలు స్మృతి ఇరానీ ఓడించారు. ప్రియాంక అక్కడే పోటీ చేస్తే భాజపా నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కోవలసి ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. అందువల్ల ఆమె ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఆమె రంగంలో ఉంటే కాంగ్రెస్‌ విజయావకాశాలు మెరుగుపడుతాయని ఆ పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు.

వచ్చే ఏడాది ఆరంభంలో ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు(UP Assembly Elections) జరగనున్నాయి. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలో 403 శాసనసభ నియోజకవర్గాలుండగా.. భాజపా 312 చోట్ల జయకేతనం ఎగురవేసింది. ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీ 47, బహుజన్‌సమాజ్‌ పార్టీ 19 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్‌కు కేవలం 7 సీట్లు మాత్రమే దక్కాయి.

కాంగ్రెస్‌ దరఖాస్తు ధర రూ.11 వేలు

అభ్యర్థుల ఎంపిక కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ అప్పుడే ప్రారంభించింది. టిక్కెట్‌ ఆశించే వారు రూ.11 వేలు చెల్లించి దరఖాస్తు ఫారం తీసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ ఈ నెల 25. వీటిని స్వీకరించే బాధ్యతలను పార్టీ నాయకులు సంజయ్‌ శర్మ, విజయ్‌ బహదూర్‌లకు అప్పగించారు.

భాజపా.. బీఎస్పీ లోపాయికారీ ఒప్పందం?

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికల ముందు భాజపా, బీఎస్పీ మధ్య లోపాయికారీ ఒప్పందాలు నడుస్తున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు స్వతంత్రదేవ్‌ సింగ్‌ ఇటీవల కార్యక్రమంలో బీఎస్పీని ప్రశంసించడమే కాకుండా ఆ పార్టీ ఒక బలమైన పార్టీ అని కూడా కితాబిచ్చారు. ఇటీవల రాయబరేలిలో భాజపా నిర్వహించిన జ్ఞానోదయ సమావేశాల్లో కూడా భాజపాకు చెందిన రాష్ట్ర మంత్రి ఒకరు బీఎస్పీని ప్రశంసించారు. ఈ పరిణామాలన్నీ రెండు పార్టీల మధ్య సాన్నిహిత్యాన్ని చూపుతోందని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను విమర్శించడంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి మెతకవైఖరి అవలంబించడం కూడా దీన్ని ధ్రువీకరిస్తోందని ప్రతిపక్షాలు సయితం భావిస్తున్నాయి.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.