ETV Bharat / bharat

రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు? - narendra modi

President elections 2022: రాష్ట్రపతి ఎన్నికల వేళ దిల్లీలోని వెంకయ్య నాయుడు నివాసం కీలక భేటీకి వేదికైంది. కేంద్ర హోం మంత్రి అమిత్​ షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​.. వెంకయ్యతో సమావేశమయ్యారు.

president elections 2022
వెంకయ్య చుట్టూ రాష్ట్రపతి ఎన్నికల రాజకీయం! అభ్యర్థి ఆయనే!!
author img

By

Published : Jun 21, 2022, 1:09 PM IST

Updated : Jun 21, 2022, 4:32 PM IST

President elections 2022: రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థిగా అధికార పక్షం ఎవరిని బరిలోకి దించుతుందన్న ఉత్కంఠ మధ్య.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో భాజపా అగ్రనేతల భేటీ చర్చనీయాంశమైంది. దిల్లీలోని వెంకయ్య నివాసంలో కేంద్ర హోం మంత్రి అమిత్​ షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ సుమారు 50 నిమిషాల పాటు సమావేశమయ్యారు. రాష్ట్రపతి అభ్యర్థి ఏకగ్రీవంపై విపక్షాలతోనూ చర్చించేందుకు నడ్డా, రాజ్​నాథ్​లకు పార్టీ అధికారం ఇచ్చింది. రాష్ట్రపతి అభ్యర్థిని నిర్ణయించేందుకు సాయంత్రం భాజపా పార్లమెంటరీ బోర్డు భేటీ జరగడానికి ముందు.. వెంకయ్య ఇంట్లో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ ఎన్నికల కోసం పలువురు కేంద్ర మంత్రులు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు సహా 14 మంది నేతలతో భాజపా ఇప్పటికే ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీతో జేపీ నడ్డా ఆదివారం భేటీ అయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా పలువురు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అందులో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేరు కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే భాజపా సీనియర్లు.. ఆయనను కలిసినట్లు తెలుస్తోంది.
దాదాపు.. కొత్త రాష్ట్రపతి ఎన్నిక లాంఛనమే అయ్యే అవకాశం ఉంది. అధికార పార్టీకి ఎలక్ట్రోరల్​ కాలేజీలో 48 శాతానికిపైగా మద్దతు ఉంది. దీంతో దాదాపు అభ్యర్థే విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఉదయం సికింద్రాబాద్‌లో యోగా దినోత్సవంలో పాల్గొన్నారు వెంకయ్యనాయుడు. ఉదయం ఆ కార్యక్రమం పూర్తి కాగానే ఆయన హుటాహుటిన దిల్లీకి వెళ్లారు. కాసేపటికే అమిత్ షా, నడ్డా, రాజ్​నాథ్​ ఆయన్ను ఇంటికి వెళ్లి కలిశారు. వీరంతా భేటీ కావాలని ముందుగానే నిర్ణయించుకున్నారని, అందుకోసమే వెంకయ్య హైదరాబాద్​ నుంచి దిల్లీ వెళ్లారని తెలిసింది. మరోవైపు.. విపక్షాలు సైతం రాష్ట్రపతి అభ్యర్థిని నిర్ణయించేందుకు కసరత్తు ముమ్మరం చేశాయి. యశ్వంత్ సిన్హా పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఈ ఉదయమే ఆయన టీఎంసీకి రాజీనామా చేయడం ఇందుకు ఊతమిస్తోంది.

ఇవీ చూడండి: ఉద్ధవ్​ సర్కార్​కు షాక్​.. మంత్రి తిరుగుబాటు.. 11 మంది ఎమ్మెల్యేలతో జంప్​?

టీఎంసీ నుంచి బయటకు యశ్వంత్​ సిన్హా.. అదే కారణమా?

Last Updated : Jun 21, 2022, 4:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.