ETV Bharat / bharat

పురిటి నొప్పులతో ఆస్పత్రికి గర్భిణి.. రూ.1500 చెల్లించలేదని వైద్యం చేయని డాక్టర్లు.. చివరకు..

రూ.1500 చెల్లించలేకపోవడం వల్ల పురిటి నొప్పులతో ఆస్పత్రికి వెళ్లిన ఓ గర్భిణికి డాక్టర్లు వైద్యం చేయలేదు. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు కూడా డబ్బులు లేకపోవడం వల్ల ఆమె బంధువులు సహాయం కోసం ఎదురుచూసిన తీరు అందరినీ కలచివేసింది. ఈ హృదయవిదారక ఘటన బిహార్​లో జరిగింది.

Pregnant woman died lack of treatment
Pregnant woman died lack of treatment
author img

By

Published : Jan 5, 2023, 9:56 AM IST

బిహార్​లోని వైశాలి జిల్లాలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. రూ.1500 చెల్లించలేకపోవడం వల్ల పురిటి నొప్పులతో ఆస్పత్రికి వెళ్లిన ఓ గర్భిణికి వైద్యం చేసేందుకు నిరాకరించారు డాక్టర్లు. పరిస్థితి విషమించి ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతదేహాన్ని కూడా తీసుకుపోవడానికి డబ్బులు లేక.. ఆ మహిళ కుటుంబసభ్యులు సహాయం కోసం అర్థించిన తీరు అందరి హృదయాలను కలచి వేసింది.

అసలు ఏం జరిగిందంటే.. రంజు అనే గర్భిణీ లాల్​గంజ్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని వార్డ్​ నంబర్​ 23లో నివసిస్తోంది. ఆమె భర్త కర్ణాటకలో కూలీగా పనిచేస్తాడు. రంజుకు నలుగురు పిల్లలు ఉన్నారు. కాగా, ఆ మహిళకు మంగళవారం పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆరోగ్యం కూడా క్షీణించింది. దీంతో కుటుంబ సభ్యులు ఓ గైనకాలజిస్టు వద్దకు తీకుకెళ్లారు. కానీ రూ.1500 ఫీజు చెల్లించకపోవడం వల్ల స్టాఫ్, వైద్యులు చికిత్స చేయడానికి నిరాకరించారు. దీంతో కుటుంబ సభ్యులు రాత్రంగా గర్భిణిని ఆస్పత్రుల చూట్టూ తిప్పి.. చివరకు ఓ క్లినిక్​​లో అడ్మిట్​ చేశారు. అనంతరం ఆమె పరిస్థితి విషమించడం వల్ల ప్రాణాలు కోల్పోయింది.

'అంబులెన్స్​ నుంచి దిగిపోండి..'
డబ్బులు ఇవ్వనందుకు అంబులెన్సు నుంచి దింపేశారని చనిపోయిన మహిళ కుటుంబసభ్యులు ఆరోపణలు చేశారు. "మేము గర్భిణిని ఓ డాక్టర్​ వద్దకు తీసుకెళ్లాము. అనంతరం అక్కడి డాక్టర్​ ఆక్సిజన్​ మాస్కు పెట్టి రూ.500 తీసుకున్నాడు. ఆ తర్వాత వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పి ఆంబులెన్స్​ కోసం రూ.1500 అడిగాడు. మా వద్ద డబ్బులు లేవు కానీ ఎవరినైనా అడిగి ఇస్తాము అని చెబితే.. ఆంబులెన్సు నుంచి దింపేశాడు" అని కన్నీళ్లు పెట్టుకున్నారు. గర్భిణి మృతదేహాన్ని అంబులెన్సులో తీసుకెళ్లడానికి కూడా వారిదగ్గర డబ్బుల్లేవు. దీంతో ఆమె బంధువులు సహాయం కోసం రిక్వెస్ట్​ చేసినా ఎవరూ పట్టించుకోలేదు. చివరకు ఓ స్థానిక నాయకుడు వచ్చి రూ. 3000 సహాయం చేశారు. దీంతో ఆటోలో మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు.

బరువు తగ్గాలని బలైన యువకుడు..
బరువుతగ్గడం కోసం ఓ ప్రైవేటు కంపెనీ మందులు వాడిన యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో జరిగింది. సూర్య అనే యువకుడు (20) సోమంగళం పోలీస్​ స్టేషన్​ పరిధిలోని కరుణికర్​ ప్రాంతంలో నివసిస్తున్నాడు. అతడు రోజు పాల ప్యాకెట్లు వేస్తుంటాడు. కాగా, చాలా లావుగా ఉండటం వల్ల.. ఎలాగైనా బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాడు. అనంతరం ఓ ప్రైవేటు కంపెనీ నుంచి బరువు తగ్గే మందులను కొనుగోలు చేశాడు. వాటిని 10 రోజుల పాటు వాడాడు. ఆ తర్వాత చాలా బరువు తగ్గాడు. కానీ ఆరోగ్యం క్షీణించడం వల్ల జనవరి 1న చెన్నైలోని రాజీవ్​ గాంధీ ప్రభుత్వాస్పత్రిలో అడ్మిట్​ అయ్యాడు. చికిత్స చేయకుండానే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.