ETV Bharat / bharat

51నెలల్లో ఐదుగురికి జన్మ.. శిశువులందరినీ విక్రయించిన దంపతులు! - నాగ్​పుర్​ లేటెస్ట్​ అప్డేట్స్

ముక్కుపచ్చలారని పసికందులను తమ తల్లిదండ్రుల నుంచి అపహరించి ఇష్టారాజ్యాంగా అమ్మతున్న ఓ ముఠా ఎట్టకేలకు దొరికింది. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కన్నబిడ్డలను సైతం వీరు విక్రయించారని తెలిసింది.

Child Trafficking Case in nagpur
Child Trafficking Case in nagpur
author img

By

Published : Nov 19, 2022, 10:47 AM IST

Updated : Nov 19, 2022, 11:34 AM IST

ఎనిమిది నెలల చిన్నారిని అపహరించిన కేసులో ఓ దంపతులను అరెస్టు చేశారు మహారాష్ట్రలోని నాగ్​పుర్​లో పోలీసులు. ఆ నిందితులను విచారించగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో కేసు మరో మలుపు తిరిగింది.
పోలీసుల కథనం ప్రకారం... రాజస్థాన్​కు చెందిన యోగేంద్ర ప్రజాపతి అనే వ్యక్తితో రీటా అనే మహిళకు 2017లో వివాహం జరిగింది. 2018లో వారికి ఓ పాప పుట్టగా ఆమెను రూ.25 వేలకు అమ్మేశారు. అంతే కాకుండా మరో ఇద్దరు పిలల్ని సైతం ఇలాగే విక్రయించారు. దీంతో వారి దందా ప్రారంభమైంది. పిల్లల్ని ఎత్తుకెళ్లి వారిని ఇతర రాష్ట్రాలకు అమ్మడం స్టార్ట్ చేశారు.

అలా నవంబర్​ 10న నాగ్​పుర్​లోని బాలాఘాట్​లో ఓ ఎనిమిది నెలల పసికందును ఈ జంట ఎత్తుకెళ్లింది. తమ బిడ్డ కనిపించకుండా పోయిందని చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్​ కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను ఐదు గంటల్లో పట్టుకున్నారు. అయితే వారిద్దరూ పోలీసుల చెర నుంచి ఎలాగోలా తప్పించుకున్నారు. అప్పటి నుంచి గాలిస్తున్న పోలీసులకు.. బాలాఘాట్​లో నిందితులు పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకుని నాగ్​పుర్​కు తరలించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

రీటా అనే ఈ మహిళ 51 నెలల్లో సుమారు 5 మంది పిల్లలకు జన్మనివ్వగా.. వారిలో ముగ్గురిని మధ్యప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో ఈ జంట విక్రయించింది. అలా సుమారు ఐదేళ్లలోనే వీరు ఏడు నుంచి తొమ్మిది మంది పిల్లలను ఇతర రాష్ట్రాలకు అమ్మేశారని పోలీసులు తెలిపారు. పిల్లలను కొనుగోలు చేసిన వారి కోసం పోలీసులు వెతకడం ప్రారంభించారు.

Last Updated : Nov 19, 2022, 11:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.