ETV Bharat / bharat

Attack on Amaravati Farmers: అమరావతి రైతులపై పోలీసుల 'కర్కశత్వం'.. అడ్డొచ్చిన వారిని ఈడ్చుకుంటూ..!

Police Attack on Amaravati Farmers: అమరావతి రైతులపై... పోలీసులు విరుచుకుపడ్డారు. శాంతియుత దీక్ష చేస్తున్న మహిళలు, వృద్ధులపై.. ఖాకీ కర్కశత్వాన్ని ప్రదర్శించారు. నిరసనలు చేస్తే శాంతిభద్రతలకు విఘాతమంటూ 144 సెక్షన్‌ విధించి... రైతులపై దాష్టీకానికి పాల్పడ్డారు. మహిళలు, వృద్ధులని చూడకుండా... అరెస్టు చేసి అందరినీ ఈడ్చుకుంటూ తీసుకెళ్లి పోలీసు వాహనాల్లో పడేశారు. పోలీసుల అరాచకంపై రైతులు, మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

Attack on Amaravati Farmers
Attack on Amaravati Farmers
author img

By

Published : May 24, 2023, 7:16 PM IST

Updated : May 24, 2023, 8:01 PM IST

అమరావతి రైతులపై పోలీసుల 'కర్కశత్వం'.. అడ్డొచ్చిన వారిని ఈడ్చుకుంటూ..!

Police Attack on Amaravati Farmers: అమరావతి రైతులపై పోలీసులు మరోసారి రెచ్చిపోయారు. తుళ్లూరు దీక్షా శిబిరంలో 1254 రోజులుగా శాంతియుతంగా దీక్ష చేస్తున్న రైతులపై.. తమ ప్రతాపం చూపారు. R-5 జోన్‌కు వ్యతిరేకంగా తెలుగుదేశం, అనుకూలంగా వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ ర్యాలీలకు పిలుపునివ్వడంతో పాటు... జై భీమ్​ భారత్​ పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్‌ దీక్షకు పిలుపునివ్వడాన్ని సాకుగా చూపి... శాంతియుత నిరసన చేస్తున్న రైతులు, మహిళలపై అత్యంత కర్కశంగా వ్యవహరించారు. దీక్షా శిబిరంలో నిరసనకు అనుమతి లేదంటూ.. రైతులపై విరుచుకుపడ్డారు. మహిళలు, వృద్ధులని కూడా చూడకుండా ఈడ్చిపడేశారు. భారీగా మోహరించిన పోలీసులను ప్రతిఘటించడం.. కొద్ది మంది రైతుల వల్ల కాలేదు. దీంతో పోలీసులు మరింత రెచ్చిపోయారు. నిరసనకు వస్తున్న వారిని లాక్కెళ్లి పోలీసు వాహనాల్లో పడేశారు. ఈ పరిణామాలతో మహిళలు కన్నీటిపర్యంతమయ్యారు.

డీఎస్పీ పోతురాజు క్షమాపణలు చెప్పాలని డిమాండ్​: రైతులకు సంఘీభావం తెలపడానికి వచ్చిన జడ శ్రవణ్‌కుమార్‌ని సైతం అరెస్టు చేసి తుళ్లూరు పోలీస్​స్టేషన్​కు తీసుకెళ్లారు. పోలీసుల తీరుపై మహిళా రైతులు తీవ్రంగా మండిపడ్డారు. తమ సొంత స్థలాల్లో దీక్ష చేస్తుంటే అడ్డుకోవడానికి పోలీసులు ఎవరని ప్రశ్నించారు. రాజధాని లేని రాష్ట్రానికి భూములివ్వడమే తాము చేసిన నేరమా అంటూ నిలదీశారు. పోలీసు యూనిఫాం వేసుకుని మహిళలను బూతులు తిట్టే హక్కు ఎవరిచ్చారంటూ.. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డీఎస్పీ పోతురాజు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

"మహిళలు అన్న గౌరవం కూడా లేకుండా చాలా దారుణమైన పదజాలాన్ని వాడారు. డీఎస్పీ పోతురాజు వచ్చి మహిళలకు క్షమాపణ చెప్పాలి. ఎవరిని అడిగి భూములు ఇచ్చారని.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఆయన ఒక హోదాలో ఉండి మహిళలను ఇలాంటి పరుష పదజాలంతో దూషిస్తారా. ఒక హత్య కేసులో సహనిందితుడిగా ఉన్న ఎంపీని అరెస్టు చేయడానికి సీబీఐ అధికారులు వస్తే శాంతి భద్రతల సమస్య అని ఓ జిల్లా యంత్రాగం మొత్తం చేతులెత్తేసింది. అదే శాంతియుతంగా నిరసన చేస్తున్న మాపై ఎందుకు దాడి చేస్తున్నారు"-బాధితులు

హత్య కేసులో సహనిందితుడిగా ఉన్న ఓ ఎంపీని అరెస్టు చేయడానికి సీబీఐ అధికారులు వస్తే వారికి సహకరించలేమని చేతులెత్తేసిన పోలీసులు.. శాంతియుత మార్గంలో నిరసన చేస్తున్న రైతులపై మాత్రం విరుచుకుపడతారా అని నిలదీశారు. ఇన్ని దారుణాలు చేస్తున్నా ప్రధాని మోదీ ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు.

ఆర్‌-5 జోన్‌పై నిరసన తెలుపుతామంటే అడ్డుకోవడం దారుణమన‌్న జడ శ్రవణ్‌కుమార్‌.. హైకోర్టు అనుమతితో మళ్లీ ఆందోళన చేసి తీరుతామని చెప్పారు. దీక్షా శిబిరాల వద్ద అరెస్టు చేసిన రైతులను మధ్యాహ్నం తర్వాత పోలీసులు విడుదల చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : May 24, 2023, 8:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.