ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి తదుపరి విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 9న విడుదల చేయనున్నారు. 9.75 కోట్ల రైతుల ఖాతాలకు 19 వేల 500 కోట్లను సోమవారం మధ్యాహ్నం పన్నెండున్నరకు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని విడుదల చేయనున్నారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడనున్న ప్రధాని జాతినుద్దేశించి కూడా ప్రసంగించనున్నారు.
పీఎం కిసాన్ పథకం కింద రైతు కుటుంబాలకు ఏడాదికి 6 వేలను మూడు వాయిదాల్లో కేంద్రం అందిస్తోంది. 4 నెలలకు ఒకసారి 2 వేల చొప్పున విడుదల చేసే సాయం నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతోంది. కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇప్పటి వరకూ 1.38 లక్షల కోట్లను రైతు కుటుంబాల ఖాతాల్లో జమ చేసినట్లు కేంద్రం తెలిపింది. మే14న 8వ పీఎం కిసాన్ నిధులను ప్రధాని విడుదల చేశారు.
ఇదీ చూడండి: క్విట్ ఇండియా.. ఉషోదయానికి ఊపిరిలూదిన ఉద్యమం