గత పాలకులు ఉత్తర్‌ప్రదేశ్ అభివృద్ధిని పట్టించుకోలేదని, రాష్ట్రంలోని ఓ ప్రాంతాన్ని, అక్కడి ప్రజలను మాఫియాకు రాసిచ్చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi news) దుయ్యబట్టారు. అయితే తమ పాలనలో రాష్ట్రాభివృద్ధిలో కొత్త శకం మొదలైందన్నారు. ఇందుకు చాలా సంతోషిస్తున్నట్టు చెప్పారు. సుల్తాన్‌పుర్ జిల్లాలో పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వేను (Purvanchal Expressway) మంగళవారం ప్రారంభించారు మోదీ. ఉత్తర్‌ప్రదేశ్ శక్తిసామర్థ్యాలను సందేహించే వారు.. సుల్తాన్‌పుర్‌కు (PM Modi UP visit) వచ్చి ఇక్కడి పరిస్థితులను చూడాలని సూచించారు.
ఇదివరకు.. దిల్లీ(కేంద్రం)తో పాటు లఖ్‌నవూ(యూపీ)లోనూ కుటుంబ పాలనలే కొనసాగాయని మోదీ విమర్శించారు. యూపీ ప్రజల ఆకాంక్షలను గతపాలకులు, కుటుంబాలు అణచివేశాయని అన్నారు. వారంతా తమ స్వప్రయోజనాల కోసం అభివృద్ధి విషయంలో వివక్ష చూపించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"ఈరోజు నేను ఇక్కడ విమానంలో దిగాను. మూడేళ్ల ముందు.. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వేకు శంకుస్థాపన చేసిన నాడు.. ఇలా విమానంలో నుంచి దిగుతానని అనుకోలేదు. కానీ అది సాధ్యమైంది. ఉత్తర్‌ప్రదేశ్, రాష్ట్ర ప్రజల శక్తిసామర్థ్యాలను సందేహించే వారు ఓసారి ఇక్కడి వచ్చి వీటిని చూడాలి. మూడేళ్ల ముందు ఇక్కడ ఏం లేవు. గత పాలకులు తమ నివాసాలు ఉన్న ప్రాంతాల్లోనే అభివృద్ధి చేసుకున్నారు. అప్పటి కరెంటు కోతలు, శాంతిభద్రతల గురించి ఎవరు మర్చిపోగలరు? కానీ, ఆ ప్రభుత్వాలను మీరు గద్దె దించారు. ఇప్పుడు అత్యాధునిక ఎక్స్‌ప్రెస్‌వేను అందుబాటులోకి వచ్చింది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వల్ల కలిగే లాభాలివి."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
యుద్ధవిమానంలో విచ్చేసి...
రహదారి ఆవిష్కరణ కోసం సుల్తాన్‌పుర్‌కు (Modi Purvanchal Expressway) యుద్ధవిమానంలో వచ్చారు మోదీ. సీ130జే సూపర్ హెర్కులస్ (C130j super hercules India) విమానంలో పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వేపై దిగారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. మోదీకి సాదరంగా స్వాగతం పలికారు.అనంతరం సభావేదిక వద్దకు తీసుకెళ్లారు.
ఎమర్జెన్సీ ల్యాండింగ్..
లఖ్‌నవూను యూపీలోని తూర్పున ఉండే ప్రాంతాలను కలుపుతూ 340.8 కిలోమీటర్ల మేర ఈ రహదారిని (Purvanchal Expressway route) నిర్మించారు. ఆరు లేన్ల ఈ ఎక్స్‌ప్రెస్ వే(Purvanchal Expressway route map 2021).. బారాబంకి, అమేఠీ, సుల్తాన్‌పుర్, అయోధ్య, అంబేడ్కర్ నగర్, ఆజంగఢ్, మౌ, గాజీపుర్ జిల్లాలను (Purvanchal Expressway map) కలుపుతుంది. రహదారిలో భాగంగా సుల్తాన్‌పుర్ వద్ద 3.2 కిలోమీటర్ల ఎయిర్‌స్ట్రిప్ సిద్ధం చేశారు. అత్యవసర సమయంలో యుద్ధ విమానాలు దిగేందుకు వీలుగా దీన్ని ఏర్పాటు చేశారు. ఈ ఎయిర్స్ట్రిప్పైనే మోదీ యుద్ధ విమానంలో దిగారు.
వాహనదారులకు ప్రయోజనం కలిగేలా, ఇంధన వాడకం తగ్గేలా ఈ రహదారిని నిర్మించారు. భవిష్యత్‌లో దీన్ని ఎనిమిది వరుసల రహదారిగా మార్చుకోవచ్చు. రూ.22,500 కోట్ల వ్యయంతో రహదారిని పూర్తి చేశారు.
ఇదీ చదవండి: