ETV Bharat / bharat

PM Modi On Congress Corruption : 'అవినీతిలో మునిగిన కాంగ్రెస్.. ఆవుపేడనూ వదల్లేదు.. రేషన్​ పంపిణీలోనూ స్కామ్'

PM Modi On Congress Corruption in Chhattisgarh : కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. మద్యం, రేషన్​తో పాటు చివరకు ఆవుపేడను సైతం వదల్లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రతి పథకంలోనూ స్కామ్ ఉందని చెప్పారు.

pm modi on congress corruption in Chhattisgarh

author img

By PTI

Published : Sep 30, 2023, 5:25 PM IST

PM Modi On Congress Corruption in Chhattisgarh : కాంగ్రెస్ పార్టీ మద్యంలోనూ అవినీతికి పాల్పడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. చివరకు ఆవుపేడను సైతం వదల్లేదని మండిపడ్డారు. ఛత్తీస్​గఢ్​లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ.. కాంగ్రెస్​పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఛత్తీస్​గఢ్ అవినీతిలో మునిగిపోయిందని, కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ప్రతి పథకంలోనూ స్కామ్ ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. పబ్లిక్ సర్వీస్ స్కామ్​లో దోషులుగా తేలినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మోదీ స్పష్టం చేశారు. గరీబ్ కల్యాణ్ యోజన కింద ఇచ్చే రేషన్​లోనూ ఛత్తీస్​గఢ్ కాంగ్రెస్ సర్కారు అవినీతికి పాల్పడిందని అన్నారు.

  • #WATCH | "No one has done as much injustice with the poor, as much as Congress... During the Covid pandemic, I decided to provide free rations to all... But Chhattisgarh's Congress government did corruption in it... They did a scam in this too...", says PM Narendra Modi at… pic.twitter.com/4tm09fRIBE

    — ANI (@ANI) September 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"పేదలకు కాంగ్రెస్ చేసినంత అన్యాయం ఎవరూ చేయలేదు. కొవిడ్ సమయంలో అందరికీ రేషన్ ఇవ్వాలని నేను నిర్ణయం తీసుకున్నా. కానీ, ఛత్తీస్​గఢ్ కాంగ్రెస్ ప్రభుత్వం అందులోనూ అవినీతికి పాల్పడింది. అందులోనూ కుంభకోణం చేసింది. కాంగ్రెస్ హయాంలో రైల్వేలకు రూ.300 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది రూ.6000 కోట్లు కేటాయించాం. ఇది 'మోదీ మోడల్'. ఇది ఛత్తీస్​గఢ్ అభివృద్ధి కోసం నేను కట్టుబడి ఉండటాన్ని సూచిస్తుంది. ఛత్తీస్​గఢ్​కు వందేభారత్ రైళ్లను కేటాయించింది కూడా బీజేపీనే."
-ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

PM Modi In Chhattisgarh : కాంగ్రెస్ పార్టీ కులాల పేరుతో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. మోదీని లక్ష్యంగా చేసుకొని ఓబీసీలను అవమానిస్తోందని మండిపడ్డారు. దళితులు, ఎస్​టీలు, ఓబీసీల ఎదుగుదలను చూసి కాంగ్రెస్ ఓర్వలేకపోతోందని అన్నారు. బీజేపీ హయాంలోనే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఆమోదం పొందిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు గత్యంతరం లేకే మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతిచ్చాయని అన్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహంతో ఉందని, దీంతో కొత్త గిమ్మిక్కులు తెరపైకి తీసుకొచ్చారని చెప్పుకొచ్చారు.

  • #WATCH | "I completed one more guarantee that I had given. Now in Lok Sabha and Vidhan Sabha, 33% of seats would be reserved for women. Under BJP's rule, Nari Shakti Adhiniyam is now a reality. And our President Droupadi Murmu signed it and made it a law yesterday... But the… pic.twitter.com/pYnNqdYOaj

"నేను ఇచ్చిన హామీలో మరొకటి పూర్తి చేశాను. లోక్​సభలో, విధానసభల్లో 33 శాతం సీట్లు మహిళలకు కేటాయించబోతున్నాం. బీజేపీ హయాంలో నారీ శక్తి అధినియమ్ వాస్తవరూపం దాల్చింది. ఇప్పుడు మహిళలంతా అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కొత్త గిమ్మిక్కు స్టార్ట్ చేశాయి. మీ ఐక్యతను చూసి వాటికి భయం పట్టుకుంది. మహిళలను కులాలవారీగా విభజించాలని అనుకుంటున్నాయి. వారి అబద్ధాలకు బలవ్వొద్దు. ఈ నిర్ణయం వచ్చే వెయ్యేళ్ల వరకు ప్రభావం చూపుతుంది."
-ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

JP Nadda Amit Shah Rajasthan Election : రాజస్థాన్​పై బీజేపీ హైకమాండ్​ ఫోకస్​.. రాత్రంతా షా, నడ్డా చర్చలు.. ఎన్నికల వ్యూహం రెడీ!

PM Modi Telangana Tour Schedule : అక్టోబర్1న పాలమూరుకు, 3న నిజామాబాద్​కు ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఖరారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.